Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది

 

ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును”

క్రొత్త నిబంధనలో అరవై రెండు సార్లు క్రైస్తవులు “పరిశుద్ధులు” అని పిలువబడ్డారు .    పరిశుద్ధులు అంటే ఒక్కసారి మాత్రమే కాకుండా రెండుసార్లు జన్మించడం ద్వారా దేవుని ప్రత్యేక ప్రజగా వేరు చేయబడిన వ్యక్తులు.

పరిశుద్ధులు భూమిపై ప్రజలు. ఒక పరిశుద్ధుడు తప్పనిసరిగా భక్తిగా ఉండకపోవచ్చు,            అయ్యో! అందుకే ఎవరు పరిశుద్ధుడో, ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం.

“లో” అనే పదములో రెండు సంభోధనలు ఉన్నాయి ఒక ఆధ్యాత్మిక సంబోధన ఒక    భౌతిక సంబోధన:

ఆధ్యాత్మిక: “క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును”

భౌతిక: “ఫిలిప్పీలో ఉన్న”

క్రీస్తు యేసునందలి

“క్రీస్తుయేసునందలి” అనే పదం మన ఆధ్యాత్మిక చిరునామా. ఇది దేవుని ముందు     క్రీస్తులో మన శాశ్వత స్థానం లేదా స్థితిని తెలియజేస్తుంది. దేవునితో సంబంధం కలిగియుండుటకు యేసుక్రీస్తు మన హక్కు. ఆయన తండ్రిముందు కలిగియున్న      స్థితిని మనమూ కలిగియున్నాము. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము- ఆయన           తండ్రి ముందు ఎంత నీతిమంతుడుగా ఉన్నాడో మనము కూడా అంత                             

నీతిమంతులుగా ప్రకటించబడ్డాము.. ఆయన నిత్యజీవముగలవాడు, కాబట్టి మనకూ       నిత్యజీవమున్నది.

ఫిలిప్పీలో ఉన్న

“ఫిలిప్పీలో ఉన్న” అనే పదాలు భౌతిక చిరునామాను తెలియజేస్తున్నాయి. ఫిలిప్పీ    పత్రికలో సందేశాన్ని గ్రహించాలంటే, పుస్తకం యొక్క నేపథ్యం గురించి కొంత తెలుసుకోవడం అవసరం.

గొప్ప అపోస్తలుడు(పౌలు) అన్యజనుల యొద్దకు చేపట్టిన మూడు గొప్ప మిషనరీ యాత్రలను గూర్చి అపోస్తలుల కార్యముల గ్రంథం ఎక్కువ శ్రద్ధను చూపిస్తుంది.. ఈ యాత్రలు ఎంతో సుదీర్ఘమైనవి మరియు ఎంతో ఫలవంతమైనవి కూడా.

మొదటి యాత్రలో అలసిపోయిన మార్కు అను యోహానును నిరాకరించుటతో పౌలు రెండవ మిషనరీ యాత్రను ప్రారంభించాడు(తరువాత పౌలు అతనిని క్రీస్తు దాసునిగా స్వీకరించాడు.) ఈ విషయమును బట్టి పౌలు మరియు బర్నబా విడిపోయారు. పౌలు ఒక క్రొత్త సహకారిని ఎంచుకున్నాడు-సీల. 

వారు అంతియోకయలోని తమ ఇంటి స్థావరాన్ని విడిచిపెట్టి ఉత్తరం మరియు పడమర వైపుకు వెళ్లి లుస్త్రకు వచ్చారు, అక్కడ తిమోతి బృందములో చేరాడు.

అపోస్తలుల కార్యములు 16 లో లూకా త్రోయలో బృందములో చేరాడు. ఇప్పుడు సువార్త బృందంలో నలుగురు ఉన్నారు. ఈ బృందం సువార్తతో యూరప్ పై మొదటి దండయాత్రను ప్రారంభించింది మరియు వారి పనిని ఫిలిప్పీలో ప్రారంభించింది.

సువార్త బృందం వచ్చినప్పుడు ఫిలిప్పీలో మనకు తెలిసినంతవరకు ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఇది క్రొత్త అనుభవము . ఇలాంటి నగరాన్ని మీరు ఎలా చేరుకుంటారు? అపోస్తలుల పద్ధతులను అన్వయించలేరు. బృందం అక్కడకు వెళ్లి సువార్తను “మాట్లాడారు” (అపొస్తలుల కార్యములు 16 13).

అపొస్తలుల కార్యములు 16:14, “ప్రభువు ఆమె[లూదియ] హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.” లూదియ, ఒక వ్యాపార మహిళ,మొదట మారుమనసు పొందిన వ్యక్తి -ఫిలిప్పీలో మాత్రమే కాదు, ఐరోపాలో మొట్టమొదట మారుమనసు పొందిన వ్యక్తిగా నమోదు చేయబడియున్నది !

ఫిలిప్పీలో మారుమనసు పొందిన రెండవ వ్యక్తి మరొక మహిళ- సోదె చెప్పు దయ్యముపట్టిన చిన్నది. సోదె చెప్పుట ఇంద్రజాలం  కాదు! కారణం: దెయ్యం పట్టుట. ఆమె అసాధారణమైన ఖచ్చితత్వంతో భవిష్యత్తును చెప్పగలిగేది. ఆమె వానిజ్య సంస్థలచేత  నిర్వహించబడుతుంది మరియు ఆమె వారికి విలువైనది. ఆమె క్రైస్తవురాలుగా మారినప్పుడు సోదె చెప్పే సామర్థ్యాన్ని కోల్పోయింది. పౌలు మరియు సీల చెరసాలలోనికి వేయబడ్డారు  . వారిని “లోపలి జైలు” లో పెట్టారు. అక్కడ వారు పవిత్ర కచేరీ నిర్వహించారు (అపోస్తలుల కార్యములు 16:25)! మనలను నిరుత్సాహపరచడానికి లేదా ఓడించడానికి పెద్ద కష్టము కాదు. నిరుత్సాహంతో వారి విశ్వాసం నీరసిల్లలేదు.

దేవుడు తనలో ఒక భయాన్ని కలుగజేసి కౄరుడైన జైలు అధికారి దృష్టిని ఆకర్షించాడు. దేవుని గురించిన తన పక్షపాతదోరణి కనుమరుగై యేసును తన రక్షకుడిగా స్వీకరించాడు. ఈ పాపాత్ముడైన అధికారి యేసుక్రీస్తు గురించి వ్యక్తిగత అనుభవానికి వచ్చాడు.

ఈ మూడు సంఘటనలు  ఫిలిప్పీలోని సంఘమునకు ప్రారంభం. వ్యాపార మహిళ, దెయ్యం కలిగి ఉన్న చిన్నది మరియు జైలు అధికారి – వివిధమైన మనోభావాలు గల వ్యక్తుల సమూహము. ఐరోపాలోని మొదటి సంఘము యొక్క కేంద్రకం ఇది!

పౌలు తన రెండవ మిషనరీ యాత్రను ముగించాడు మరియు మూడవ ప్రయాణంలో అతను ఫిలిప్పీని రెండుసార్లు సందర్శించాడు. దీనికి 12 సంవత్సరముల తరువాత పౌలు ఫిలిప్పీ పత్రికను ఒక రోమ చెరసాలనుండి రాసాడు.

నియమము:

ఐరోపాలో సువార్తను ప్రారంభించడానికి దేవుడు విభిన్న వ్యక్తులను ఉపయోగించుకున్నాడు.

అన్వయము:

దేవుడు ఆ విభిన్న వ్యక్తులను వాడుకున్నప్పుడు, నిన్ను మరియు నన్ను కూడా ఆయన రాజ్య వ్యాప్తికై వాడుకుంటాడు.

Share