“ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది”
“అధ్యక్షులకును పరిచారకులకును”
క్రొత్త నిబంధన సంఘమును గురించి కొంత తెలుసుకోవడం ముఖ్యం. మనము వ్యక్తిగత తెగల గురించి కాదు, క్రొత్త నిబంధనలోని స్థానిక సంఘమును గురించి శ్రద్ధ కలిగియున్నాము
“సంఘము” అను పదము లేదా దాని బహువచనం క్రొత్త నిబంధనలో 114 సార్లు సంభవిస్తుంది; ఇది పాత నిబంధనలో కనిపించదు. 114 సార్లలో, 98 భూమిపై భౌగోళికంగా గుర్తించబడిన స్థానిక సంఘమును సూచిస్తున్నాయి మరియు 16 “ఆయన శరీరమైన సంఘమును ” సూచిస్తున్నాయి (ఎఫె 1:22,23) – ఖచ్చితంగా గుర్తించలేని వ్యవస్థ ఎందుకంటే దానిలో ఎక్కువభాగము పరలోకసంబంధమైనది. అది ఏ ప్రదేశములోనైన క్రీస్తును వ్యక్తిగతముగా ఎరిగిన వారైన క్రీస్తు శరీరము.
అధికారుల యొక్క రెండు సమూహాలు ఇక్కడ సూచించబడ్డాయి- అధ్యక్షులు మరియు పరిచారకులుు. వీరు సంఘమునకు బాధ్యత వహిస్తారు.
“పరిశుద్ధులు,” “అధ్యక్షులు,” మరియు “పరిచారకులు” అనే పదాలు బహువచనంలో ఉన్నాయని గమనించండి. తీతుకు 1:5 ఇలా చెబుతోంది,
” నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.” పదం బహువచనం అని గమనించండి.
ఆ తరువాత పెద్దల అర్హతలు తెలియజేయబడ్డాయి : “ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.ఎందు కనగా అధ్యక్షుడు. . .” (తీతుకు 1:6,7) ఇక్కడ వాడిన “అధ్యక్షుడు” అనే పదం ఫిలిప్పీ 1 లో వాడబడిన పదమే. కాబట్టి “అధ్యక్షుడు” మరియు “పెద్ద” అనే పదాలు క్రొత్త నిబంధనలో పరస్పరం వాడబడుతూ ఉంటాయి. ఒక అధ్యక్షుడు ఒక పెద్ద మరియు ఒక పెద్ద ఒక అధ్యక్షుడు.
బైబిలు చెబుతుంది “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీ 13:17). నాయకుల పట్ల చూపవలసిన గౌరవమును గూర్చి మరొక భాగం మరొక వ్యాఖ్య చేస్తుంది:
“మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పు వారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.” (1 థెస్స 5:12,13)
ఈ రోజుల్లో స్థానిక సంఘములలో చాలా విభజన మరియు అసమ్మతి ప్రబలంగా ఉంది. నాయకత్వంలోని దేవుని దైవిక క్రమాన్ని గౌరవించకపోవడమే దీనికి కారణం.
నియమము:
సంఘము తన నాయకత్వాన్ని గౌరవిస్తే, దేవుడు వారికి “సమాధానం” ఇస్తాడు.
అన్వయము:
మన స్థానిక సంఘముల నాయకత్వానికి మన మద్దతును బహిరంగంగా ధృవీకరించడంలో మనలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి.