Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

“మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.”

 

ఫిలిప్పీ మొదటి రెండు వచనాలు ఈ పత్రికకు నడవ. పౌలు యొక్క అన్ని పత్రికలలో ఇది చాలా సున్నితమైనది. ఫిలిప్పీలోని విశ్వాసులను గద్దించడం లేదా మందలించడం లేదు. పౌలు జైలులో ఉన్నప్పుడు వ్రాసినప్పటికీ ఈ లేఖ ఆనందం మరియు సమాధానపు మాటలతో తడచి ముద్దయినది (1 7,13,14,16). నిరాశ లేదా చీకటి యొక్క జాడ లేదు.

“మీకు కృపయు సమాధానమును కలుగును గాక.”

రెండవ వచనం శుభాకాంక్షలు. ప్ప్రోత్సాహకరమైన రెండు మాటలు ఉన్నాయి “కృప” మరియు “సమాధానము”. “కృప” అనేది పాశ్చాత్య దేశస్తుల అభివాదము మరియు  “సమాధానము” తూర్పు దేశస్తుల అభివాదము

కృపయు

ఆంగ్లంలో ఏ ఒక్క పదం కృప యొక్క అర్థాన్ని డీకోడ్ చేయదు. ఏ షరతులు లేకుండా దేవుడు మనకొరకు చేసినదే కృపు. ఇది మానవ ప్రయత్నము లేని దేవుని ఉచిత అనుగ్రహం.

కృప అంటే దేవుని క్రియాశీలత, అందువలన ఆయన ఏమి అయివున్నాడో దాని ఆధారంగా దేవుడు అనుగ్రహిస్తాడు కానీ మనము ఏమి అయివున్నామో లేక మనము ఏమి చేసియున్నామో దానినిబట్టి కాదు. ఆయన కృప రేడియం లాంటిది, దాని ప్రాధమిక శక్తిని తగ్గించే సంకేతం లేకుండా దాని తీవ్రమైన కిరణాలను నిరంతరం విడుదల చేస్తుంది. మానవ దానము క్షీణిస్తుంది, పాడవుతుంది లేదా చెదురుమదురు అవుతుంది. అయితే, కృప కొనసాగుతూనే ఉంటుంది. కృప అనేది దౌర్భాగ్యులకు పరిచర్య చేసే దేవుని ప్రేమ యొక్క శక్తి.

సమాధానమును

ఈ పదమునకు అర్థం కలిపి బంధించడం. దేవుడు తన సంరక్షణను మనం గ్రహించగలిగేలా తనను తాను మనకు బంధించుకుంటాడు. కోపం మరియు ఆందోళన మనలను ఆయన నుండి దూరం చేస్తాయి. సమాధానము మనలను ఆయనతో బంధిస్తుంది.

సమాధానము అనేది చర్య లేకపోవడం కాదు; ఇది అసమ్మతి లేకపోవడం. ఇది మరణం ద్వారా సూచించబడదు కాని సజావుగా నడుస్తున్న ఇంజిన్ ద్వారా. ఇది దేవునితో సామరస్యంగా ఉన్న జీవితం యొక్క ఆరోగ్య స్థితి, దేవుడు ప్రవేశించిన జీవితం.

కృప ఉన్నచోట, సమాధానము నివసిస్తుంది. ప్రభావవంతమైన సేవతో పనిచేసే మన శక్తి యొక్క మూలమే కృప. శుభములు తెలుపుతున్నప్పుడు కృప ఎప్పుడూ సమాధానమునకు ముందు ఉంటుంది.

మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు

“నుండి” అనేది అంతిమ మూలం యొక్క ప్రతిపాదన. మన జీవితంలో కృప               మరియు సమాధానమునకు మూలం ఏమిటి? కృప మరియు                                       సమాధానమునకు మూలంగా తండ్రి మరియు కుమారుడు కలసియున్నారు.

 ప్రభువైన యేసు పేరు ఈ పత్రికలో41 సార్లు ప్రస్తావించబడింది. అనగా సగటున         రెండు లేదా మూడు వచనాలకు ఒకసారి.

నియమము:

దేవుడు ఎవరో మరియు ఏమి అయియున్నాడో దాని ఆధారంగా ఆయన మనతో సంబంధం కలిగియుంటాడు కాని మనము ఎవరిమో మరియు ఏమి అయియున్నామో దానిని బట్టి కాదు.

అన్వయము: 

మనము దేవుని అనుగ్రహం మరియు ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నామా? దేవుని ఎదుట యోగ్యులగుటకు చేసే నిరంతర ప్రయత్నాలు క్రైస్తవ జీవితాన్ని నిరాశపరుస్తాయి. మనము దేవుని పరిపూర్ణత యొక్క ప్రమాణాలను సాధించలేము. క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. అందువల్ల పౌలు విశ్వాసులను కృప మరియు సమాధానము ప్రాతిపదికన జీవించమని సవాలు చేశాడు, అది మన నుండి కాదు, దేవుని మూలం నుండి వచ్చింది.

Share