“నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను”
“నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను”
పౌలు రాసిన లేఖలలో, ఐదు చెరశాల నుండి వ్రాయబడ్డాయి. పౌలు రాత పరిచర్య జైలులో ఎంత జరిగిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతను ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలొస్సయులు, ఫిలేమోను మరియు 2 తిమోతిలను వ్రాసాడు. పౌలు స్వయం సానుభూతికి తావివ్వడు. తత్ఫలితంగా, మనకు ఈ ఆనందకరమైన లేఖ ఉంది.
ఈ వచనము లేఖ యొక్క ముఖ్యభాగమును ప్రారంభిస్తుంది; 1 మరియు 2 వచనములు శుభములు తెలియజేయుట. ఈ భాగము – పరిశుద్ధుల కోసం పౌలు ప్రార్థన – 3 వ వచనం నుండి 11 వరకు కొనసాగుతుంది.
పౌలు తన ప్రార్థనను కృతజ్ఞతతో ప్రారంభించాడు. ఒక సమూహం అతని కృతజ్ఞతకు అర్హమైనప్పుడల్లా, అతను ఈ విధంగా ప్రారంభించాడు. సంఘములలో ఒకదాని కొరకు మాత్రమే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు-గలతీయులు. వారి సిద్ధాంతపరమైన లోపం కారణంగా వారినిబట్టి అతడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు.
“నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను”
“నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారీ, నేను మిమ్మును గురించి ఆలోచించిన ప్రతిసారీ నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” కృతజ్ఞతలు చెల్లించుటలో పౌలు విశాలత విస్తారమైనది. పౌలు మరియు ఫిలిప్పీయులు మధ్య వందల మైళ్ళు మరియు అనేక సంవత్సరాలు దూరమున్నది, అయినప్పటికీ వారికొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అతని మనసు అలాగే నిలచియున్నది. పౌలును ఆకట్టుకోవడానికి ఫిలిప్పీయులు గొప్ప సాక్ష్యం కలిగిన అద్భుతమైన సంఘమై ఉండాలి. ఇతర వ్యక్తులు మన గురించి ఈ విధముగా చెప్పడం చాలా అద్భుతమైన విషయం, “ఆ వ్యక్తినిబట్టి దేవునికి కృతజ్ఞతలు. నేను అతనిని కలిసినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆమె నాకు ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నది.”
అయినప్పటికీ, మనలో చాలా మందికి ఒక సాక్ష్యం ఉంది, దీని ద్వారా ప్రజలు అంటారు, “ఆ వ్యక్తి నా దారికి అడ్డు రావడానికి నేను ఏమి చేశానో నాకు తెలియదు! నేను ఆ వ్యక్తిని మరచిపోగలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు!” ప్రతి విశ్వాసి ఒక ఆశీర్వాదం లేదా శాపం, రెక్క లేదా భారము, బరువు లేదా బాధ్యత. మనము వారి క్రైస్తవ జీవితంలో ప్రజలకు సహాయం చేస్తాము లేదా వారికి ఆటంకం కలిగిస్తాము.
గుర్తుంచుకోవడం పౌలుకు విచారం కలిగించలేదు; అతను ఆశీర్వాదకరమైన జ్ఞాపకాలు మాత్రమే కలిగి ఉన్నాడు. మీకు కృతజ్ఞతలు చెప్పే సామర్థ్యం ఉందా? మీ సంఘము కొరకు మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారా? మీరు మీ సంఘములోని వ్యక్తుల కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారా?
“చేసుకొనినప్పుడు” అంటే “చేసుకొనిన సమయములో” అని కాదు. ఫిలిప్పీయులు గుర్తుకువచ్చిన ప్రతిసారీ పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. దీని అర్థం ‘ఆధారంగా.’ అంటే, ఫిలిప్పీయులు పౌలు కృతజ్ఞతకు ఆధారంగా ఏర్పడ్డారు.
ఒకవేళ పౌలు జ్ఞాపకములో ఉంచుకోవాలనుకుంటే ఫిలిప్పీలో కొన్ని కలవరపెట్టే జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి – దయ్యమునుండి విడుదల పొందిన చిన్నదానియొక్క యజమానుల రౌధ్రము మరియు పౌలు పట్ల ఆ పట్టణపు అధికారుల మరియు ప్రజల ప్రవర్తన. ప్రస్తుతము ఇద్దరు స్త్రీలు ఒక బాధకరమైన జగడములో చిక్కుకొనియున్నారు (4:2). పౌలు ఈ చిన్న చిన్న చికాకులను గుర్తించుకోదలచలేదు. మనము దేనిని గురించి ఆలోచించాలని ఎంచుకుంటామో దానిలో నుండి కృతజ్ఞత పుట్టుకొని వస్తుంది. జీవితములో సాధారణ దయ మరియు సహాయము కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించుటలో విఫలమగుట విశ్వాసి చేసే సాధారణమైన పొరపాటు.
“మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను”
పౌలు వారితో కలిగియున్న సంబంధము అంతటినిబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు అని గ్రీకులో సూచించబడినది.
నియమము :
మన ప్రస్తుత ఆశీర్వాదాలు దేవుని నుండి వచ్చినవి అని గుర్తించడం చాలా ముఖ్యం.
అన్వయము:
మన ప్రస్తుత ఆశీర్వాదాలు దేవుని నుండి వచ్చినవి అని గుర్తించడం చాలా ముఖ్యం. ఆ విధముగా గుర్తించుట దేవుడు మన జీవితాలలో అందించిన వాటినిబట్టి కృతజ్ఞతలు చెల్లించే సామర్థ్యం మరియు కారణం అవుతుంది.
” కృతజ్ఞత” అనే పదం గ్రీకు భాషలో వర్తమాన కాలం లో ఉంది మరియు స్థిరమైన కృతజ్ఞతను సూచిస్తుంది. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న వాటికొరకై కృతజ్ఞతలు తెలిపే సామర్థ్యాన్ని మనం మనఃపూర్వకముగా మరియు రోజువారీగా అభివృద్ధి చేస్తున్నామా?