Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

“మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు ప్రార్థించుచున్నాను”

 

“ప్రార్థించుచున్నాను”

9 నుండి 11 వ వచనాలలో మనం పౌలు చేసిన అద్భుతమైన ప్రార్థనలలో ఒకదానికి వచ్చాము. పౌలు ప్రార్థనలు చాలా సూచించదగినవి. అవి ఎప్పుడూ వేషధారణ లేక అర్థహృదయముతో చేసినవి కాదు. అవి ఎల్లప్పుడూ పరిస్థితికి సంబంధించినవిగా ఉంటాయి. ఈ ప్రార్థనలో పరలోకపు పరిమళం ఉంది. పౌలు ప్రార్థనలు క్రొత్త నిబంధనలోని ఆధ్యాత్మికత యొక్క గరిష్టస్థాయికి గుర్తు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉత్తమంగా ఉండాలి. ప్రార్థన దేవునితో సంభాషించుట. దేవుని సన్నిధి యొక్క పవిత్రజ్వాల మన జీవితంలోని వేషధారణనంతా కరిగించివేస్తుంది.

ఈ ప్రార్థనలో మూడు మనవులు ఉన్నాయి, ఇవన్నీ “వలెనని” అనే పదం  కలిగియున్నాయి. 9 వ వచనంలో మొదటి “వలెనని.”

“మీ ప్రేమ . . . అభివృద్ధిపొందవలెననియు”

పౌలు ప్రార్థించిన మొదటి అవసరత ఏమిటంటే, వారి ప్రేమ “అభివృద్ధిపొందుట.” ప్రేమ కలిగి ఉండటం ఒక ఎత్తు. ప్రేమలో అభివృద్ధిచెందుట మరొక ఎత్తు. వారి ప్రేమను విస్తరించాల్సిన అవసరం ఉంది. 

“అభివృద్ధిపొందుట” అనే పదానికి పొంగి పొర్లుట, ఉబుకుట, తగినంత కంటే ఎక్కువ అని అర్థం. ఇది ఒకరి జీవితాన్ని అధిగమించే ప్రేమ. ప్రేమ కేవలం స్థితి కాదు. బైబిలువేతర జీవితానికి స్థితులు ఉంటాయి; ఒక స్థితిలో ప్రేమ ఉంటుంది, మరొక స్థితిలో ద్వేషం మరియు ఆగ్రహం ఉంటుంది.

“అంతకంతకు”

ఇక్కడ ప్రేమ యొక్క బాహుళ్యాన్ని తెలియజేయడానికి క్రియావిశేషణాలు ఉపయోగించబడుతున్నాయి. ప్రేమ తరంగాలు ఒక దాని తరువాత ఒకటి మన ఆత్మల తీరాన్ని తాకాలి. కృపలో మనమెంత ఎదుగుతామో ప్రేమించే సామర్థ్యం అంత పెరుగుతుంది. మనం వృద్ధిపొందతున్నట్లుు మనకు తెలిసే ఒక మార్గం ఏమిటంటే, మనం ప్రేమించబడనివారిని ఎంతగా ప్రేమిస్తున్నామో చూడటం.

 ఇతరులకంటే క్లిష్టతరమైన కొందరితో మనము చాలా చనువుగా ఉంటాము. ప్రజలందరూ మనకు సమానంగా కనిపించరు.. ఇది వారి స్వభావం, వారి దుస్తులు లేదా పనులు చేసే విధానం కావచ్చు. మనం వృద్ధిచెందే ప్రేమతో ప్రేమిస్తే, అవన్నీ కరిగిపోతాయి. అవన్నీ అసంబద్దమైనవే. వారికోసం మనము వారిని ప్రేమించము. యేసు నిమిత్తం మనము వారిని ప్రేమిస్తాము.

కాబట్టి ఎదుగుతున్నక్రైస్తవుని యొక్క మొదటి గుర్తు ఒక స్థబ్దమైనప్రేమను మించిన క్రియాశీలకమైన ప్రేమ. పరిపక్వత లేని క్రైస్తవులు క్షణంలో కోపిస్తారు; వారు త్వరగా ఉద్రేకానికి లోనవుతారు; వారిని అభినందించని వ్యక్తులవలన వారు ఆవేశపరులవుతారు. కానీ మనం ప్రేమలో మరింత పెరుగుతున్న కొద్దీ, ఆ విషయాలు చిన్నవిగా మారుతాయి. పరలోకం మరియు నరకం, పాపం మరియు నీతి, దేవుడు మరియు దెయ్యం యొక్క దృఢమైన వాస్తవాల వెలుగులో, ఇలాంటివి అసంబద్ధం మరియు అసంభవమైనవిగా మారతాయి. తన జీవితంతో దేవుని మహిమపర్చాలనే అతని అసలు ఉద్దేశ్యం నుండి దేవుని బిడ్డను అవి చాలా సులువుగా మళ్లిస్తాయి.

మనలను విసికించడానికి ప్రజలను అనుమతించినప్పుడు, మన ఆత్మలను బాధపెట్టడానికి ప్రజలను అనుమతించినప్పుడు, మన జీవితాల్లో దేవుని మహిమను ప్రతిబింబించకుండా మనం తప్పుదారి పట్టుతాము.

పిల్లలు అపరిపక్వ రీతిలో ఏదైనా చేసినప్పుడు, ‘అవి పిల్ల చేష్టలు. వారు దానిని అధిగమిస్తారు.’ అని అంటారు మనం ప్రేమలో పెరిగేటప్పుడు చులకన భావాన్ని అధిగమించాలి.

నియమము:

బైబిల్ ప్రేమ క్రియాశీలకమైనది; ఇది దేవుని బిడ్డను బాల్యం నుండి ఆధ్యాత్మిక యవ్వనంలోకి మార్చేవిధంగా ి పుష్కలంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది.

అన్వయము:

మనం ఇంకా ద్వేషం, కోపంలో పట్టబడియున్నామా? క్రైస్తవ్యం యొక్క ప్రారంభ దశలో మనం చిక్కుకొనియున్నామా? మనము బాల్య సంకేతాలను గుర్తించామా?

Share