మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
మానవువునిగా యేసును అంగీకరించడం గురించి మనము నాల్గవ ప్రకటనకు వచ్చాము.
“ మనుష్యుల పోలికగా పుట్టి “
యేసు “మనుష్యుల పోలిక” లో జన్మించాడు. అతని పుట్టుక ఇతర మనుషుల మాదిరిగానే ఉంది, అయినను విభిన్నమైనది.
” ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ” (యోహాను 1:14). ” శరీరధారియై” అనే పదానికి అర్ధం అతను ఇంతకు ముందు లేనివిధముగా అయ్యాడు; అతను ముందు దేవుడై ఉండెను. ఇప్పుడు ఆయన తన పూర్వపు దైవత్వము నుండి మానవత్వానికి మారిపోయాడు.
యేసు స్త్రీ నుండి జన్మించాడు; అతని మానవ మూలాలు మగవారికి చెందినవి కావు ఎందుకంటే అతని కన్యయందు జన్మించెను.
” అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను….” (గల 4: 4).
యేసు కన్య యందు పుట్టుట అంటే ఆయనకు పాపపు స్వభావం లేదు. అలాగే, అతను ఎప్పుడూ పాపం చేయలేదు. ఈ రెండు వాస్తవాలు దేవుని మచ్చలేని గొర్రెపిల్లగా మన పాపములకు చనిపోవడానికి ఆయనకు అర్హత ఇచ్చాయి.
” శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా 8: 3)
” మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.” (హెబ్రీ 4:15)
” ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.” (హెబ్రీ 2:14)
గాబ్రియేలు దేవదూత మరియతో ఇలా అన్నాడు: “… పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ” (లూకా 1:35). యేసు జననం ప్రత్యేకమైనది. ఆయన గురించి ప్రతిదీ ప్రత్యేకమైనది. ఆయన నిజంగా దేవుడు మరియు నిజమైన మానవుడు. అతని మొదటి రాక ప్రత్యేకమైనది, మరియు అతని రెండవ రాకడ కూడా ప్రత్యెకమైనదై ఉంటుంది.
అతని ప్రత్యేకమైన పుట్టుక లేకుండా, క్రీస్తు లేనివారు స్వర్గానికి వెళ్ళే మార్గం లేదు. పాపం కోసం శ్రమపడుటకు ఆయన ఆ శరీరాన్ని సిలువకు తీసుకెళ్లవలసి వచ్చింది: “… బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. ” (హెబ్రీ 10: 5).
నియమము:
యేసు జననం ప్రత్యేకమైనది; మన పాపములకై చనిపోవడానికి ఆయన అసాధారణమైన మార్గంలో అర్హత పొందాడు.
అన్వయము:
మీ హృదయాలలో యేసును ప్రత్యేకమైన వారిగా ఎంచుచున్నారా?