Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.

 

సంపూర్ణులమైన వారమందరము

15, 16 వచనాలు దేవునికి స౦తోష౦కలిగించే జీవితాన్ని సమర్పిస్తున్నాయి. దేవునిని సంతోషపరచే జీవితం పరిణతి చెందినది. పౌలు తన శ్రోతలను క్రీస్తును ఉద్దేశి౦చి తనతో నడవమని చెప్పాడు. తన లక్ష్యం వారి యొక్క లక్ష్యం ఒకటే.

పౌలు తాను ‘అప్పటికే పరిపూర్ణుడు కాలేద’ని 12వ వచన౦లో చెప్పాడు. 12వ వచన౦, పాపరహిత విషయ౦లో పరిపూర్ణత భావాన్ని తెలియజేస్తో౦ది. తాను దానిని ఎప్పుడూ సాధించలేదని ఆయన ఒక్కనించాడు. ఈ వచనములో ఆధ్యాత్మిక పరిపక్వత అనే అర్థంలో ఆయన ఇదే పదాన్ని ఉపయోగించారు.

పుట్టిన తరువాత మొదటి క్రమం పోషణ:

” సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. ” (1 Pet. 2:2,3).

ఒక వ్యక్తి మొదట దేవుని కుటుంబంలో పుట్టినప్పుడు, అతనికి జీవము మాత్రమే ఉంటుంది. క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలో అతనికి తెలియదు. తన పుట్టుక గురించి తెలుసుకోవలసిన వన్నీ కూడా తెలియవు. నీతిమంతునిగా తీర్చబడుట, సమాధానపరచబడుట, లేదా ప్రవచన౦ గురి౦చి ఆతనికి తెలియదు. ఇవన్నీ ఆయన తన ఆధ్యాత్మిక జీవితంలో ఆ తర్వాత తను ఆనందకరముగా తెలుసుకుంటాడు. క్రీస్తు లేకుండా తాను నశించిన వానిగా, సిలువపై క్రీస్తు మరణంపై విశ్వాసంతో దేవునితో సరైన సంబంధాన్ని కలిగి వున్నాడని మాత్రమే ప్రస్తుతానికి ఆయనకు తెలుసు. నూతన జన్మ అనేది ఒక ప్రక్రియను ప్రారంభించే సంక్షోభం. క్రీస్తులో పరిణతి చెందుట అనునది ఈ ప్రక్రియ.

తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి బిడ్డను ఇంటికి తీసుకొచ్చినప్పుడు, వారు పోషణ గురించి ఆందోళన చెందుతారు, జీవముగురించి కాదు. బిడ్డ గర్భధారణ సమయంలో జీవితాన్ని పొందింది. వీరు జీవితం గురించి కాదు, అభివృద్ధి గురించి. ఐదేళ్ల వయసులో బిడ్డ శరీరం ఇంకా శిశువుగా ఉంటే అది విషాదం. బిడ్డకు పోషణ అవసరం. సరైన విటమిన్స్, మినరల్స్ అందాలంటే సరైన ఫార్ములా అవసరం.

రెండవ పేతురు 2:2లో పేతురు క్రొత్త విశ్వాసులకు “వాక్యముయొక్క స్వచ్ఛమైన పాలు” కోరాలని సవాలు చేశారు. ” స్వచ్ఛమైన” అనే పదానికి అర్థం కల్తీ లేనిది అని. ఒక పసిక్రైస్తవుడు ఎదగాలంటే, ఆయన దేవుని స్వరాన్ని వక్రీకరణకు గురికాకుండా వినాలి. మనము వాక్య ధ్యానమాలికలకుఎక్కువ సమయాన్ని యిస్తున్నాము మరియు బైబిలుకు క్లుప్త సమయాన్ని ఇస్తున్నాము. బైబిలు స్థానంలో ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తే మనకు ఆధ్యాత్మిక పోషణ లోపిస్తుంది. బిడ్డకు స్వచ్ఛమైన పాలు కావాలి. ఒక కొత్త క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని స్థానభ్ర౦శ౦ చేయడానికి ఆధ్యాత్మిక ప్రత్యామ్నాయాన్ని అనుమతి౦చలేడు. అభివృద్ధి గు౦పులు, సహవాస౦, క్రైస్తవ పుస్తకాలు కల్తీలేని దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయ౦ కాదు. ఎదగడానికి ప్రాథమిక పోషణ దేవుని స్వరమే.

సూత్రం:

కల్తీలేని రూపంలోని బైబిలు, క్రైస్తవ ఎదుగుదలకు ఆధార౦గా ఉ౦ది.

అన్వయము:

మీ ఆధ్యాత్మిక ఆహార౦లో అనేక స౦క్లిష్టతలను మీరు ప్రత్యామ్నాయ౦గా ఉ౦చారా? ఆ ప్రక్రియ మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను నిర్వీర్య౦ చేసి౦దా? మీరు వాక్యము నుంచి తొలగి ఉన్నారా? ఎ౦దుకు దేవుని వాక్య౦లోకి తిరిగి రాకూడదు?

Share