కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
“ కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము “
పరిణతి చెందిన వ్యక్తి ఆధ్యాత్మిక పరంగా ఎదిగిన వ్యక్తి. అతడు/ఆమె ఇక ఏమాత్రం బిడ్డ కాదు (1 కొరిం 2:6; 14:20; హెబ్రీ. 5:13-14).
పిల్లల్లాగే ఆలోచించి పిల్లలలా ప్రవర్తి౦చే వృద్ధ క్రైస్తవులను మనము ఎరుగుదము. “తెలివితక్కువ వారు కానీ సంతోషంగా ఉన్నరు” అనే మాట విని ఉంటాము. 25 ఏళ్లుగా క్రైస్తవులుగా ఉన్న వారు న్నారు. ఎందుకు? క్రైస్తవ్యము తమ జీవిత పరిస్థితులకు ఎలా వర్తిస్తుందో వారికి తెలియదు. ఇది 20వ శతాబ్దం చివరిలో క్రైస్తవ్యాన్ని వర్ణిస్తుంది. నేడు చాలామ౦ది క్రైస్తవులు పిల్లల్లాగే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. సంఘములలో పిల్లలు పెద్దవారిలా ఆలోచించి, ప్రవర్తించడానికి ప్రయత్నించే వారితో నిండి ఉంటుంది. వారు తెలివి తక్కువవారు కానీ సంతోషంగా ఉన్నారు.
ప్రతి క్రైస్తవుడు మారుమనసు పొందిన సమయము నుండి “మన ప్రభువైన యేసుక్రీస్తు కృపలోను జ్ఞానములోను వృద్ధి పొందవలెను” (2 పే. 3:18). మన ఆధ్యాత్మిక అవసరాల కోస౦ దేవుడు ఇచ్చే అనుగ్రహమే కృప. దేవుడు ఏ తీగలను జతచేయడని కూడా కృప సూచిస్తో౦ది. కృప మనము చేయు కార్యముల వైపుకాక అంటే మనకోసం దేవుడు చేయు కార్యమువైపు ఆధారపడుట.
చాలామ౦ది తమ క్రైస్తవ జీవిత౦లో దాదాపు క్రైస్తవ అనుభవ౦ అంతయూ ఊయలలోనే ఉ౦టారు. ఒక వ్యక్తి ఆత్మనిండిన జీవితాన్ని గడపగలడు మరియు అపరిపక్వతను కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మికత అనేది పరిణతికి సంబంధించినది కాదు. ఆధ్యాత్మికత అనేది ఒక సంపూర్ణమైనది- మనం దేవునితో సహవాసములో ఉన్నను, లేకయున్నను. పరిణతి సాపేక్షమైనది- దేవుని సత్యాన్ని మనం ఎంత మేరకు సముచితంగా అనుసరిస్తున్నము. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది బాల్యం నుంచి కౌమారదశ వరకు మరియు పరిపక్వత వరకు జరుగు ఒక ప్రక్రియ. పరిపక్వత సమయంలో ఉన్నత పిలుపువైపు వైపు చూచుట అమల్లోనికి వస్తుంది.
బిడ్డ నిరంతరం మరియు క్రమం తప్పకుండా ఉన్నతపిలిపువైపు దృష్టించడు (వ.14). అప్పుడప్పుడు ఉన్నత పిలుపు గురించి ఆలోచించవచ్చు. ఉన్నత పిలుపు అనేది ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకింపబడిన ఆలోచన. ఉన్నత పిలుపు వైపు జీవించుట అనునది ఒక దృక్పథం. ఇది తదుపరి పదబంధం యొక్క సవాలు:” ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి.”
సూత్రం:
పరిణతి అనగా ఉన్నత పిలుపువైపు దృష్టించుట సంభవించు దశ వరకు దేవుని కృపలో ఎదుగుట.
అన్వయము:
మన౦ క్రీస్తులో పరిణతి చె౦దామా లేదా అనుదానికి ఒక మ౦చి సూచన, ఉన్నత పిలుపుపై ఎంతగా దృష్టి కలిగిఉన్నము అనునది. ఉన్నత పిలుపు అనునది మన ప్రభువుకై, జీవించడానికి ఆయనను కలుసుకోడానికి గల జీవన దృక్పథం. మీ జీవన ధ్రుక్పధములో మీరు పరిణతి చెందినారా?