Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.

 

శిలువను ద్వేషించేవారి యొక్క మూడవ మరియు నాల్గవ లక్షణాలు తదుపరి విశ్వాస వ్యవస్థలను చూపిస్తాయి.

వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు “

కొందరు తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి గొప్పలు చెప్పుకుంటారు. వారి సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. తమ్మును తాము అగౌరవపరచుకొనుట వలన వారు ప్రజాదరణ పొందుతారు. సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుట అంటే, జీవితం పట్ల ఒక చులకన అభిప్రాయం కలిగిఉండుట. ప్రజలు తాము అనైతికమైనవారమని గర్వపడుతుంటారు. టెలివిజన్ కార్యక్రమాల్లో లక్షలాది మంది ముందు తమ నిర్బ౦దమైన, నీచామైన కార్యాలను తెలియజేయడానికి వారు సిగ్గుపడరు. స్వలింగ సంపర్కులు “బయటకు వస్తున్న” కవాతులో కవాతులు చేస్తుంటారు.

” వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.” (ఎఫె. 4:18)

వారు ఏ మాత్రం సిగ్గు పడరు. వారి మ౦చి చెడుల భావ౦ దేవుని పట్ల వారి దృక్కోణాన్ని నివారిస్తో౦ది. జీవితాన్ని వక్రీకరించడములో ఆనందిస్తారు. స్వేచ్ఛ ఒక అసంగతమవుతుంది. తమ కోరికలను నిగ్రహి౦చకు౦డ జీవిస్తారు.

అబద్ధం ఈ రోజు మంచి వ్యాపార సాధనగా పరిగణించబడుతుంది. విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌కు దోహదం చేసినంతవరకు కాపీ కొట్టడము ఆమోదయోగ్యమని భావిస్తారు. ముగింపు విధానాలను నిర్ధారిస్తుంది. మంచి కారణము కొరకు మోసం చేయడం, అబద్ధం చెప్పడం తప్పేమికాదు అని భావిస్తారు.

యువ అరాచకవాదులు మన దేశ వీధులలో నడుస్తున్నారు. పిల్లలు పిల్లలను చంపుతున్నారు. వారికి సామాజిక గౌరవాలు నేర్పిస్తాం కానీ వారికి నైతిక విలువలు నేర్పించము.

దేవుడు తన మహిమను ప్రతిఫలి౦చడానికి తన సొ౦త ప్రతిరూప౦లో మానవుని సృష్టి౦చాడు. మనిషి దేవుని లక్షణాలను ప్రతిబింబించేలా రూపొందించాడు. వాతవేయబడిన ఆత్మ దేవుని మహిమను మరుగుచేస్తుంది.

భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు “

ఈ పదబంధం జీవితానికి వారి యొక్క వైఖిరి యొక్క సారాంశం. “మనస్సు” అనే పదం “వైఖరి” అనే భావాన్ని తెలియజేస్తుంది. జీవితం పట్ల వారి దృక్పథం మానవ దృక్కోణం. వారు జీవితం యొక్క లంబదృష్టి కంటే(తన వాక్యంలో నమోదు చేయబడ్డ జీవితం గురించిన దేవుని దృక్కోణం) జీవితం యొక్క సమాంతర వీక్షణను కలిగి ఉంటారు. వారు జీవితాన్ని దైవదృష్టితో కాకుండా మానవ దృక్కోణంలో చూస్తారు. దేవుడు లేని లోకపు ప్రమాణాలను వారు స్వీకరిస్తారు.

సూత్రం:

మానవ దృక్కోణం నిత్య విలువలను నీరుగార్చే దిశగా నడిపిస్తుంది.

అన్వయము:

దైవిక దృక్కోణం ఎల్లప్పుడూ లంబ మరియు క్షితిజ సమాంతర విలువలు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. పాపములో చనిపోయిన ఆత్మను దేవుని వాక్య౦ ఇకమీదట ప్రేరేపించదు. పాపౌ ఒప్పుకోలుకు రానంతగా మీరు చాలా కాల౦గా సహవాస౦ ను౦డి బయటకు తొలగిఉన్నారా? దేవుడు మీకు ఇక ఏమాత్రం వాస్తవం కాదని ఈ లోకపు ప్రమాణాలలో ఇమిడివున్నరా?  

మీరు వ్యక్తిగతంగా క్రీస్తు యెరుగకుంటే, క్రీస్తు సిలువకు సంబంధించి మీరు ఎక్కడ నిలబడతారు? మీరు ఏ వైపు ఉన్నారు? క్రీస్తుకొరకా లేదా వ్యతిరేకంగానా?

Share