Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవ డైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.

 

ఫిలిప్పీయుల ఈ విభాగ౦లో పౌలు ఒక ప్రేరేపి౦చగల వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇచ్చాడు. అతను వ్యక్తిగత సర్వనామాన్ని “నేను” అను మాటను 15 సార్లు ఉపయోగించాడు. అతని సాక్ష్యం కూడా అపో.కా. 9, 22, 26; 2 కొరింథీయులు 9; 2 కొరింథీయులకు 11; మరియు రోమన్లు 7 లో ఇవ్వబడింది. ఇది తాను నేర్చుకున్నది మాత్రమే కాక జీవించిన సత్యమని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఎవరూ దాటని విధంగా ధర్మశాస్త్రవాదము బాటలో వెళ్ళాడు.

పౌలు శరీరమును ఆస్పదము చేసుకోవడములేదు అని  నిరూపి౦చడానికి తన స్వీయ చరిత్రను గుర్తుచేస్తున్నాడు. తను ఆస్పదము చేసుకోగల విజయాల జాబితా ఇస్తున్నాడు. ఏళ్ల తరబడి ఆయన తన ఆస్పదము వాటిపై నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు దగ్గరకు వచ్చాడు కాబట్టి, ఆయన ధర్మశాస్త్రవదములో తన మతస౦బ౦ధ జీవితాన్ని ఒక పెంటకుప్పగా దృష్టి౦చాడు! పెంట కుప్పమీద తన జాబితాను విసిరివేసాడు! అతనికి ధర్మశాస్త్రవదము సాధించిన ఘనకార్యాలు చెత్తవలె పెంట కుప్పవలె ఉండినది.

కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును “

కావలయునంటే, అనగా, మనము ఆస్పదము చేసుకోడానికి శరీర౦లో ఏదో ఉ౦టు౦దని ఆలోచి౦చడానికి, పౌలు తనను తాను ఒక ఉదాహరణగా ఇచ్చాడు. క్రైస్తవుడు కావడానికి ము౦దు, ఆయన ధర్మశాస్త్రవాదములో ఎ౦తో ప్రగతి సాధించుకున్నాడు. ఒక ధర్మశాస్త్రవాదముఅనుసరించు వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను ఒకడు.

క్రైస్తవ జీవిత౦లో మన౦ తరచూ మన ఆధ్యాత్మిక వనరులపై జీవి౦చడానికి శోధి౦చబడుతుంటాము. దేవునిపై కాక, మన ప్రార్థనజీవితముపై మన౦ ఆనుకుంటాము. మన౦ దేవునిలో కాదు, మన కార్యకలాపాల ద్వారా మన౦ ధైర్యాన్ని తీసుకు౦టాము. మన౦ దేవునిమీద కాక మన ఆధ్యాత్మిక జీవితపు కార్యాచరణల మీద ఆధారపడతాము. మన౦ మన శక్తితో జీవి౦చడానికి, మన౦ క్రమశిక్షణకు స౦బ౦ది౦చే బలమైన కట్టుబాట్లను మన౦ అనుసరిస్తాము. దేవుడు తప్ప ప్రతిదీ మనము ఆస్పదము చేసుకుంటాము! మనం పారవశ్యం, సన్యాసత్వము, నిషేధాలు, స్వీయ క్రమశిక్షణ అన్నీ ప్రయత్నిస్తాము – ప్రయోజనం లేకుండా. పౌలు ఇవన్నీ ప్రయత్నించాడు. వాటిని ఆస్పదము చేసుకొనుటకు అవకాశం లభించింది. కాని ఆయనకు శరీరమునకు అవిశ్వాస తీర్మానపు ఓటు వేసాడు.

మరి ఎవ డైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.”

పౌలు, అన్నిటిక౦టే ముఖ్య౦గా, జీవిత౦లో ఆ విధానాన్ని అనుసరి౦చాడు. ఎవరైనా తమ మతస౦బ౦తి ఆధార౦గా దేవునిని సంతోషపెట్టగలరని అనుకు౦టే, వారు పౌలును అధిగమి౦చలేరు. ఆయనకు గొప్ప మతపర అనుభవము కలదు.

సూత్రం:

మతం, ధర్మశాస్త్రవాదము, స్వయం కృషి అన్నీ మనల్ని విఫలం చేస్తాయి.

నియమము:

క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యొక్క ఏర్పాట్లలో మాత్రమే మనం పరస్పరం విశ్వసించగలం. శరీరక్రియలను దేవుడు అంగీకరించడు అనే వాస్తవాన్ని మనం అంగీకరించటం చాలా కష్టం. మన బాటలో చిన్న చిన్న బండలు ఎదురైనప్పుడు, మనము తొట్రుపడుతుంటాము.

మన ఆధ్యామిక జీవితములో ధర్మశాస్త్రవాదము గుర్తించని రూపములో దాగు ఉంటుంది.  ఎక్కువగా ప్రార్థించుటవలన, ఎంతోమందికి సాక్ష్యమిచ్చుటవలన, లేదా ఆత్మ నిండిన జీవితాన్ని యాంత్రికంగా జీవించుటవలన, ఆధ్యాత్మికంగా విజయం సాధిస్తాం అని భావిస్తాము. ఈ సాధనాలు లేకుండా మనం ఒక చైతన్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందలేము. కానీ మన౦ సాధనాలను అంతిమముగా భావిస్తే, మన క్రైస్తవ జీవితము ప్రమాధములో పడుతుంది. నైతికత ఆధ్యాత్మికతతో సమానము కాదు. నైతికత అనేది మనిషి ఆధారితమైనది. ఆధ్యాత్మికత అనేది దైవ ఆధారితమైనది. మీ క్రైస్తవ జీవితాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? ఇది మతానికి, ధర్మశాస్త్రవాదముకు సంబంధించిందా? లేక అది దేవుని నిబంధనలపై ఆధారపడి౦దా?

Share