Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

 

పౌలు తన మారుమనసుకు ము౦దు ప్రకటి౦చిన ఏడవ చివరి ఆధీక్యత తన మానవ నీతిగురి౦చి.

ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని “

ఇది దేవుడు లేని నీతి. ఇది నకిలీ నీతి. అది 9 వ వచనములోని నీతికి సమానం.

” ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక”

పౌలు తన బలులను సరిగా అర్పించువాడు. ధర్మశాస్త్రప్రకారము అర్పణలుచేయడంలో ఆయన అనింద్యుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రము నీతికొరకు ఆచారములను పేర్కొనినది; వాటిని అనుసరించుటలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయన భక్తిపరుడు. అయితే, ఆయన భక్తిపరుడైననూ కానీ రక్షణ పొందలేదు. క్రీస్తు రక్తము తప్ప దేనిమీదైనా ఆధారపడటం ప్రాణాంతకం. పౌలు తాను పరిపూర్ణుడనని చెప్పలేదు; పూర్తిగా మతముపై విశ్వాసముంచి జీవించాడు. ఆయన ధర్మశాస్త్ర పరమైన ఆచారములను పరిపూర్ణంగా ఆచరించాడు.

ఇక్కడ మానవ నీతికి, దేవుని నీతికి మధ్య వ్యత్యాసము ఉన్నది. దేవుని నీతి క్రీస్తు యొక్క బలిని బట్టి మాత్రమే పొందగలదు.

సూత్రం:

మతము మనల్ని దేవుని ఆమోదమును కలిగించదు; క్రీస్తు రక్తము మాత్రమే దేవుని అనుగ్రహమును కలిగించును.

అన్వయము:

మీ ఆధారము మత౦మీదనా లేదా మీ రక్షకుని మీదనా? అనుభవించవలసిన బాధలన్నీ యేసు సిలువపై పూర్తి చేశాడు. ఆయన సమస్తమును సమాప్తము చేశాడు; ఆయనకు అన్నిటిలో రుణపడి ఉన్నాము. అంతకన్నా తక్కువ దేన్నయినా మునిగిపోయే ఇసుకవంటిది. “స్థిరమైన బండయైన క్రీస్తుమీద నేను నిలుచుదును, మిగిలిన భూమి అంతా మునిగిపోవు ఇసుకవంటిది.”

Share