క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును
“ క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి “
“అయితే” అనునది ఇక్కడ వెత్యాసము యొక్క బలమైన కలయిక గల పదము. ధర్మశాస్త్రమునకు భిన్నంగా మరో నీతి కూడా ఉంది. నీతి రెండు రకాలు. మొదటిది, నకిలీ నీతి, ఒక మానవ నిర్మిత నీతి, ఒక కృత్రిమ నీతి, మనిషి కృషి యొక్క నీతి. దేవుని దృష్టిలో ఆత్మనీతి ఒక అప్రామాణికమైన నీతి. ఇది మానవ నీతి.
ఇంకొక నీతి, నా చేతిలో ఏమీ లేదు, కేవలం సిలువను నేను హత్తుకొనుచున్నాను అని చెప్పు నీతి. క్రీస్తు ద్వారా దేవుని నుండి ఒక వరంగా ఉన్న నీతి.
ఈ రెండు రకాల నీతి ఒకదానితో ఒకటి పోసాగ లేవు. అవి పరస్పరం ప్రత్యేకమైనవి. వాటిని కలపడం అసాధ్యం. ఒకటి మనిషి యొక్క నీతి, రెండోది దేవునిది. ఈ మానవ నీతి, ఆరోపించబడిన నీతిని నిర్బ౦దిస్తుంది. దేవుని నీతి ప్రత్యక్షత మీద నిలుస్తుంది, కేవల౦ దేవుని ఏర్పాటుపైనే ఆధారపడి వు౦టుంది.
“విశ్వాసము ద్వారా” అనగా విశ్వాస సాధనము ద్వారా. “విశ్వాసం” అనే పదానికి ఇక్కడ ప్రాముఖ్యత ఉంది. ఈ వ్యక్తీకరణకు సమాంతర౦గా “దేవుని ను౦డి నీతి” అనే పదబ౦ద౦ ఉ౦ది. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశము దేవుడే అని నొక్కి వక్కాణిస్తుంది. ఈ వ్యక్తి తనను తాను త్యజించి, దేవుని అనుగ్రహాన్ని ఆశ్రయి౦చుకున్నాడు.
ఇది స్వీయ లొంగుబాటు. విశ్వాసం మానవ శక్తి యొక్క ప్రతి ప్రయత్నాల పతనం. దేవుని నీతిలో మాత్రమే మన౦ ఓదార్పుపొ౦దగలము. దేవుడు తన నీతిలో పాపి భాగమును తీసుకుంటాడు.
దేవునిని ప్రభావకర్తగా చూడడమే విశ్వాసము. మనం దేవునికు సంర్పించుకొనుటవలన మహిమపరుస్తాము. దేవుడు కార్యము చేసినట్లయితే, అప్పుడు దేవుడు మహిమపొందుతాడు. మనం చేసినట్లయితే, అప్పుడు మనకు ఘనత లభిస్తుంది. సమస్య యేసుక్రీస్తులోని మహిమకు, శరీరవిహాయము అతిశయముల మధ్య ఉన్న వ్యత్యాసమే. ఇవి ఒకదానితో మరొకటి మినహాయింపు.
సూత్రం:
మనకు ఆయన నీతిని ఇచ్చే ప్రభావకర్తగా మనం దేవుని చూసినప్పుడు, మనం ఆయనను మహిమపరుస్తాం.
అన్వయము:
క్రీస్తు ద్వారా దేవుని నీతిని మన౦ స్వీకరించినప్పుడు, ఆయన ఆ గుర్తింపు ద్వారా మహిమపరచబడతాడు. మన౦ దేవునికి అర్పి౦చడానికి మన వద్ద ఏమీ లేదని ఒప్పుకునే౦త వినయ౦ కలిగి ఉన్నమా?