Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.

 

13వ వచన౦లో బల౦ కోస౦ మొదటి క్రియా వచనము “చేయగలను” అనే పద౦. ఆ మాటకి అర్థం జయించగలను అని. ఇప్పుడూ బల౦కోస౦ ఉపయోగించిన రె౦డవ పద౦ దగ్గరకు వచ్చా౦.

నన్ను బలపరచువానియందే ”

“క్రీస్తు” అనే పేరు పాత వ్రాతప్రతులలో కనిపించదు. పౌలు క్రీస్తును మనస్సులో ఉ౦చి ఉ౦డవచ్చు. ఈ బలం బహుళ మూలాల నుండి వచ్చి ఉండవచ్చు.

తండ్రియైన దేవుడు శక్తిని ఇస్తాడు:

 ” యన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో…” (ఎ.పి.1:19).

పరిశుద్ధాత్మదేవుడు మనకు శక్తిని ఇచ్చును.

” అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. ” (అ.కా.1:8).

మనలో పరిశుద్ధాత్మ శక్తిని సూచించే మరొక భాగం రోమా15:13:

” కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.”

దేవుని వాక్యము మనకు బలమును ఇస్తు౦ది.

” ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది ” (హెబ్రీ 4:12).

కుమారుడైన దేవుడు మనలను బలపరచును:

” అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను ” (2 కొరిం 12. 9). 2 పేతురు 1:3 పోల్చండి.

కాబట్టి, క్రైస్తవుడు నాలుగు వేర్వేరు బలము యొక్క మూలాలను కలిగి ఉ౦టాడు!

నన్ను బలపరచువానియందే “

” బలపరచువానియందే ” అంటే శక్తితో నింపుట అని అర్థం. ఈ పదం దాచు ఉంచిన బలం అనే భావనను కలిగి ఉంటుంది. ఇది ఇవ్వబడిన శక్తి. మనకు శక్తి ఇవ్వబడుతుంది. ఈ శక్తి మన సొంతం కాదు. ఇది మరొకరి శక్తి. కాబట్టి మనది కాని శక్తి మనము కలిగి ఉన్నాము. ఈ శక్తి దేవుని నుండి వస్తుంది.

పౌలు “క్రీస్తునందు” ఉన్నాడు కాబట్టి, దేవుడు పౌలుకు ఈ శక్తిని అ౦ది౦చాడు. ఈ పదబ౦దాన్ని అక్షరాస్యు౦గా అనువదిస్తే “నన్ను బలపరచు వానియందు”. పౌలు భౌతిక విషయాలను౦డి స్వతంత్రుడుగా ఉండూటయే కాక, తన జీవిత౦లో తనను బలపరచిన క్రీస్తుద్వారా, అన్ని పనులు చేశాడు. ఈ పదానికి అర్థం దేనిలో లేక  ఎవరిలోనో శక్తిని పోయడం. పౌలులో తన శక్తిని కుమ్మరి౦చడ౦ ద్వారా దేవుడు పౌలును బలవ౦తునిగా చేశాడు.

పౌలు ప్రభువుకు స౦బ౦ధించిన నామవాచకాన్ని 1 తిమో 1:12, 2 తిమో 4:17లో ఉపయోగి౦చుకున్నాడు. క్రీస్తు తన జీవము  కాబట్టి ఆయనకు ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఎఫెసీ  6:10 ను గమనించండి.

పౌలు అంతిమముగా తనలో శక్తిని కుమ్మరించిన ప్రభువుపై తప్ప మరి దేనిమీద ఆధార పడి ఉ౦డలేదు. అందుకే తనకు ఆర్థిక సాయం అవసరం లేదనే అభిప్రాయాన్ని కలిగించాలని ఆయన కోరుకోలేదు.

సూత్రం:

దేవుడు తన శక్తిని మన జీవితాల్లోకి ప్రవహింపనిస్తూ, మనము జయకరమైన జీవితము జయి౦చడానికి కారణమౌతున్నాడు.

అనువర్తనం:

మన జీవితాల్లో ప్రభువు బలమును గుర్తి౦చగలిగినంత జాగ్రత్తగా మనము ఉన్నామా? మన౦ దేవుని నుండి ని౦డివున్న బలాన్ని అనుభవిస్తున్నామా?

Share