అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.
“ అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.”
లేఖన౦లోని ఇతర భాగాలు క్రీస్తు స౦బ౦ది౦చిన కార్యములకు ఆర్థిక౦గా సహకారము అందించుటను గూర్చి బలముగా చెబుతాయి:
” ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.” (1 కొరి. 9:14)
పరిచర్యకు కొరకు పరిచర్యకొరకైన బహుమానము మధ్య సంబంధము ఉంది. 1 కొరి౦థీయులు 9 పరిచర్యలో ఉన్నవారి ఆర్థిక సహకరం కోస౦ మాట్లాడుతుంది.
“వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను” (గల. 6:6). ఈ వాక్య౦లో, వాక్యబోధకునికి ఇవ్వడ౦తో స౦బ౦ధ౦ ఉ౦ది.
” బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు–నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. (1 తి. 5:17,18). ఇది ఒక ప్రత్యేకమైన వచనము, అందులో పాత నిబంధన, కొత్త నిబంధన రెండీంటిని ఉల్లేఖిస్తుంది. పాత, కొత్త నిబ౦ధనల ను౦డి వచ్చిన లేఖన భాగాలు, ప్రభువు పనిచేయడానికి ఆర్థిక సహకారము చాలా కీలక౦గా చెబుతున్నాయి.
” కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. ” (హెబ్రీ 13:15,16). మళ్లీ, ఆర్థిక సహకారము, పరిచర్యలోని నాయకత్వముతో సంబంధము కలిగి ఉన్నది.
సూత్రం:
క్రీస్తు కారణానికి ఆర్థిక సహకారము అనేది లోక౦ కోస౦ దేవుని ప్రణాళికకు ఒక ప్రాముఖ్యమైన స౦బ౦ధ౦.
అనువర్తనం:
స్థానిక సంఘము, వ్యక్తులు ఇద్దరూ దేవుని సేవకులపట్ల చాలా ఖచ్చితమైన ఆర్థిక బాధ్యతను కలిగి ఉన్నారు. దేవుడు మీ పర్సును, మీ జీవితాన్ని రక్షించాడా?