Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగ మునై యున్నవి

 

దేవుని మహిమపరచడ౦ లో మూడవది, చివరి వివరణ, ” దేవునికి ప్రీతికరమును.”

దేవునికి ప్రీతికరమును”

ఇచ్చే అర్పణ దేవుని సంతోషిస్తుంది. ” ప్రీతికరము ” అనే పదాలు హెబ్రీ 13:15-16లో ఉపయోగి౦చబడింది: ” కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి..”

సూత్రం:

మన పెదవులతోను, మన ౦ ఇచ్చిన అర్పణతోను మనము దేవుని స౦తోషపరచగలము.

అనువర్తనం:

మీరు దేవుని సంతోషి౦చు పనిలో ఉన్నారా? దేవుని సంతోషపరచటానికి ఒక మార్గం క్రీస్తు యొక్క పని నిమిత్తము ఇచ్చుట.

Share