మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
“ మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.”
ఫిలిప్పీయుల పత్రికలోని విశయములన్నిటిలో దేవుడు నిత్యము మహిమపరచబడెను. ఉదాహరణకు పౌలుకు ఫిలిప్పీయులు చేసిన ఏర్పాట్ల ద్వారా దేవుడు మహిమపరచబడెను. దేవునికి మహిమచెల్లించుట ఆయన స్వభావమును, లక్షణాలను గుర్తించుట.
“ఆమెన్” అంటే అది సత్యము అని. పౌలు దేవుని అద్భుతాన్ని సత్య౦గా ధృవీకరి౦చాడు.
ఏదైనా ప్రయోజకరమైనదా లేదా అనే దానికి తుది పరీక్ష అది దేవునికి మహిమను తెచ్చిస్తు౦దా లేదా అనునది. పౌలు చెరసాలో గడుపిన కాలము దేవుని మహిమను తెచ్చి౦ది.
సూత్రం:
సృష్టియొక్క పరమ ఉత్కృష్టమైన ఉద్దేశము దేవుడు మహిమపరచబడుట.
అనువర్తనం:
మన జీవితలక్ష్యం దేవునిపైనే కేంద్రీకృతమై ఉంది. మానవుడు కాదు, దేవుడు సృష్టికి అంతమై ఉన్నాడు. మీరు నేడు జబ్బుపడితే, మీ రోగ౦లో దేవుని మహిమపరచ౦డి. మీరు కష్టమైన రోజును ఎదుర్కొన్నట్లయితే, దేవుని గొప్పదనాన్ని ఙ్ఞాపకము చేసుకోండి మరియు ఆయన కష్టమైన పరిస్తితిని శాశ్వతమైన ప్రయోజనంగా మారుస్తాడు. దేవునికి మహిమకలుగ జేయని అవకాశము లేని కష్టము ఏదీ లేదు. ఒకరి జీవితంలో నివసి౦చే ఆశీర్వాదాలు దేవుని గొప్పదనాన్ని ఘనపరచుటకు అవకాశాలు.