ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి. నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
ఇప్పుడు ఫిలిప్పీయుల పత్రిక సమాప్తికి, వీడ్కోలుకు మనము వచ్చాము (4:21-23).
అనేక మూలాల నుండి అభినందనలు వచ్చాయి. పౌలు మొదట తను సొ౦తగా పలకరి౦చాడు.
“ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి”
పౌలు ను౦డి, తోటి పరిచారకుల ను౦డి, ఇతర విశ్వాసుల ను౦డి, ప్రేతోర్యమను గార్డు ను౦డి ఫిలిప్పీయులకు చివరి పలకరి౦పులు వచ్చాయి.
“ప్రతి పరిశుధ్ధునికి” అంటే ఫిలిప్పీలోని ప్రతి విశ్వాసికి. ఆ విశ్వాసి ఎ౦త దీనముగా ఉన్నా, పౌలు తన స్వాగతాన్ని పొ౦దాలని కోరుకున్నాడు. ప్రతి వ్యక్తి తన అభినందనలు అందుకోవాలనుకున్నాడు. ఆయనకు ఎవరూ ప్రాధాన్యంలేని వారు కాదు.
“ నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.”
పౌలు సహవాసులు ఫిలిప్పీయులను పలకరి౦చారు. ఇది రెండవ పలకరింపు. వారు బహుశా పౌలు ప్రయాణసహచరులు, తిమోతి వ౦టివారు.
“ పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు”
ఫిలిప్పీయులకు వందనము చెప్పిన మూడవ వర్గ౦లో “పరిశుధ్ధులు” ఉన్నారు. ” పరిశుద్ధులందరును ” బహుశా రోమాలోని సంఘపు విశ్వాసులు (1:1). రోమన్ సామ్రాజ్య౦లో శక్తివ౦తమైన రాజకీయ శక్తితో కూడిన నాలుగవ, చివరి పలకరింపును, వచ్చేసారి పరిశీలిస్తాము.
పలకరి౦చడ౦ పౌలు లేఖలకు స౦బ౦ది౦చిన లక్షణ౦. ఆయన ప్రజల పట్ల చాలా ఆలోచి౦చేవాడు. ఆయన ప్రజలను ప్రేమి౦చేవాడు.
సూత్రం:
పలకరించడం ఇతరుల పట్ల శ్రద్ధను చూపుతుంది.
అనువర్తనం:
ప్రజల ఆలోచనా పూర్వకత క్రైస్తవ్యానికి ఒక మూల విలువ. ఇవాళ మీరు ఇతరుల మధ్య వెళ్లినప్పుడు, వారి సాన్నిధ్యాన్ని మీరు ఒక పలకరింపుతో గౌరవిస్తారా? ఇతరుల పట్ల, వారి ఆందోళనల పట్ల మీరు ఆసక్తి చూపుతారా? మీ దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇతరులకు ఎంత “అప్రాముఖ్య౦గా” ఉన్నా, మీకు ముఖ్యమా?