ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.
పౌలు సాధారణ౦గా తన ప్రతి లేఖలను దేవుని కృపను నొక్కి వక్కాణి౦చడ౦ తో ముముగిస్తాడు. పౌలు ఫిలిప్పీయులకు ఒక ముగింపు ప్రార్థనతో ఆ ఉత్తరాన్ని ముగించాడు. పరిశుధ్ధులు చేయు ప్రార్థనలు, వారి హృదయాలను వెల్లడిస్తాయి. ఫిలిప్పీయులు దేవుని కృపను అనుభవిస్తారని పౌలు హృదయ వాంచ.
“ ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.”
పౌలు తన తుది, కిరీట౦మువంటి వ్యాఖ్యానము చేసాడు, వారు దేవుని కృపను ప్రతిరోజు అనుభవి౦చాలని ఆయన కోరుకున్నాడు.
ఇది సంప్రదాయబద్ధంగా పలకరించే దానికంటే ఎక్కువ. ఆ పలకరింపుకు పౌలుకు లోతైన అర్థ౦ ఉ౦ది. ఇది అపొస్తలుడి ప్రగాఢ వాంఛ. అ౦తకన్నా ఎక్కువగా ఫిలిప్పీయులు తమ జీవితాల్లో దేవుని కృపను అనుభవి౦చాలని పౌలు కోరుకున్నాడు. పౌలు లేఖనాలను ప్రస౦గ౦లో, ముగింపుల్లో కృప ఒక కేంద్రబిందువు.
ప్రభువైన యేసుక్రీస్తు కృపకు మూలము.
” మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” (2 కో 8:9)
” ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక..” (2 కో 13:14)
“ఆమెన్”
“ఆమెన్” అంటే అలాగే జరుగును గాక అని. పౌలు తన విశ్వాస విధానాన్ని ఇలా ధృవీకరి౦చాడు: “ఫిలిప్పీయులు తమ జీవితములో దేవుని కృపను ప్రతిదినము అనుభవి౦చుదురు గాక.”
సూత్రం:
దేవుని కృప క్రైస్తవ జీవనానికి ఒక కేంద్ర కార్యాచరణ సూత్రం.
అనువర్తనం:
దేవుని కృప మనకొరకు ఆయన చేసిన ఏర్పాట్లు. ఈ నిబంధనలను అర్హత లేకుండా ఇస్తాడు.
మీ జీవిత౦లో దేవుని ఏర్పాట్ల పట్ల మీకు అవగాహన ఉ౦దా? ఆ నిబంధనలు ఏమిటో మీకు తెలుసా? మీరు రోజు ఎదుర్కొను వాటి కోసం ఆ నిబంధనలను ఉపయోగించగలరా? మీ అనుభవంలో దేవుని కృప పనిచేసిందా? దేవుని కృప “మీతో” ఉన్నదా?