Select Page
Read Introduction to Philippians ఫిలిప్పీయులకు

 

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

 

6వ వచన౦లో పౌలు ప్రార్థనకు ఉపయోగి౦చబడిన మూడు మాటలలో రె౦డవది “విర్మి౦పు.”

విజ్ఞాపనములచేత

ఒక నిర్ధిష్ట అవసరానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను ” విజ్ఞాపనము” అని అంటారు. ప్రత్యేక సంధర్భము కోసం కోసం చేసిన విజ్ఞాపనము ఇది. ఇది ఒక ప్రత్యేక అవసరం కోసం ప్రార్థన. ఉత్తర అమెరికాలో పునరుద్ధరణ కోసం ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది ఒక విజ్ఞాపనము. ప్రార్థనలో మనలను సాధారణమైన విశయాలనుండి ఖచ్చితమైన వాటికి విజ్ఞాపనము నడిపిస్తు౦ది. దేవుడు “నన్ను, నా ప్రియమైనవారినీ ఆశీర్వది౦చగలడని” ప్రార్థి౦చడ౦ నిర్దిష్టమైన ప్రార్థన కాదు. దేవునివద్దకు ఒక ప్రత్యేక మైన అవసరం తీసుకొని, దానిని తీర్చు బాధ్యతతో ఆయనమీద మోపడం విజ్ఞాపనము.

ప్రార్థనలు సాధారణ మనవులు. విజ్ఞాపనలు ప్రత్యేకమైన అభ్యర్థనలు. సాధారణ ప్రార్థనలు చాలా భావోద్వేగ ఆవిరి లేకుండా అందించబడతాయి. ఎవరూ జబ్బుపడలేదు, చనిపోలేదు. విజ్ఞాపనల విషయ౦ వేరు. ప్రత్యేక అవసరం గురించి చిత్తశుద్ధితో గోజాడుట. దేవుడు నా భర్తను శస్త్రచికిత్స ద్వారా బ్రతికించబోతున్నాడో లేదో నాకు ఖచ్చిత౦గా తెలియదు.

ప్రార్థన, విజ్ఞాపనలు అనేక భాగాలలో ఉన్నాయి:

“ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. (ఎఫె. 6:18)

“మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది” (1 తి. 2:1-3)

“శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీ 5:7)

సూత్రం:

ప్రత్యేక అవసరాలు తీర్చటానికి విజ్ఞాపనము చేయడం అనేది ఒక ప్రత్యేక మైన ఆధిక్యత.

అనువర్తనం:

ప్రార్థన జీవిత౦లో విజ్ఞాపనములుచేయుటకు మీరు కొంత సమయాన్ని కేటాయి౦చగలరా?

Share