మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
నేడు మన మనస్సును నింపుకొనవలసిన తొమ్మిది ప్రాంతాలలో ఆరవ స్థానానికి చేరుకున్నాము. ఈ తొమ్మిది ప్రాంతాలు విచ్ఛిన్నమైన సంబంధాల నుండి మనల్ని కాపాడనున్నాయి.
“ ఏవి ఖ్యాతిగలవో “
“ఖ్యాతిగల” అనేది తియ్యని మాట లేదా నిష్పాక్షికమైన మాట్లాడటం. ఈ వ్యక్తి తన కొరకు బాగా మాట్లాడతాడు. ఆయన పేరు, గెలుపు, ఆకర్షణ, ఇతరులను ‘బాగా చేశారు’ అని చెప్పుకోవడానికి దారితీస్తు౦ది. ఆయన ప్రశంసనీయమైన వ్యక్తి. ఈ విశ్వాసి ప్రతికూల మరియు వినాశకరమైన వ్యక్తి కాక, సానుకూల మరియు నిర్మాణాత్మకమైన వ్యాక్తి. ప్రతికూల, చెడు నివేదికపై మాత్రం నిలిచి ఉండవద్దు. నిరుత్సాహ౦తో ఉన్న విషయాలగురి౦చి మన౦ ప్రప౦చ౦పట్ల మన దృక్కోణాన్ని వక్రీకరి౦చబడును. చెడు మరియు అసత్యపు మాటలు సమాధానాన్ని నాశన౦ చేసే అవకాశ౦ ఉ౦ది.
యువోదియా సుంటుకే లోని సద్గుణాల గురించి ఆలోచి౦చినట్లయితే, క్రీస్తులోని ఆమె సహోదరి కి౦ద మ౦చి సంబంధన్ని కలిగి ఉ౦డేది. యువోదియా తన సత్క్రియలను ఆవర్థనం చేసి, తన లోపాలను కనిష్టం చేసిఉంటే, సుంటుకే ప్రశంసను గ్రహించేది. ఆమె ఒక స్నేహితునిగా యువోదియాతో సహవాసము చేయడానికి గొప్ప సందర్భం కలిగి ఉంది.
మరోవైపు, యూవోదియా, సుంటుకే గురించి తాను కనుగొనగలిగిన ప్రతి భయంకరమైన కథలను చాడీలను చెప్పితే, సర్దుబాటు కోసం అవకాశము లేదు. కొంతమంది వ్యక్తులు ఇతరుల యొక్క వైఫల్యాలను వివరించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది వారికి భిన్నంగా మంచిగా కనిపిస్తుంది.
సూత్రం:
దేవుడు మన౦ ఇతరుల గురి౦చి మ౦చి, దయగల, నిజమైన విశయాలు చెప్పాలనుకు౦టాడు.
అనువర్తనం:
ఇతరుల గురించి బాగా మాట్లాడటం వల్ల సయోధ్య కుదిర్చే వాతావరణం ఉంటుంది. మన స్నేహితుల వైఫల్యాలపై దృష్టి సారించడానికి బదులుగా, వారి యొక్క సానుకూల సహకారాలపై దృష్టి సారిస్తాం మరియు తరువాత రాజీకి మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక స్నేహితుడిని సరిచేయడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు, మనం అతడిని విమర్శి౦చే౦దుకు అనుమతి౦చే ఒక విశ్వసనీయతా వాతావరణాన్ని సృష్టి౦చి ఉ౦టా౦.