మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
విశ్వాసి తన ఆలోచనా విధానాన్ని రూపి౦చవలసిన తొమ్మిదవ, చివరి విషయము “ మెప్పైనను“.
“ యే … మెప్పైనను ఉండినయెడల “
“ మెప్పైనను ” అనే పదానికి ముందు “ఏ” అనే పదం ఉంది. “ఒకవేళ” అనేది ఊహకు “ఉంటే” అనేది ఒక “అయితే” అని చెప్పబడుతుంది: అవతలి వ్యక్తిలో “నిజానికి ఏదో ప్రశంసనీయమైనది ఉంది” అని. దేవుని ప్రతి నిజమైన శిశువుకు, ఆయనలో ఎంత వక్రబుద్ధి ఉన్నా, అతనిలో ఏదో ఒక ప్రశంసాపాత్రఉంటుంది. ఇది విశ్వాసి ఆలోచించవలసిన రెండవ ఊహ. ఇతర క్రైస్తవుల్లో స్తుతి౦చదగిన దాని గురి౦చి మన౦ ఆలోచి౦చాల్సి ఉ౦ది.
“మెప్పు” నైతిక శ్రేష్ఠత యొక్క సాధన ఫలితంగా ప్రశంసయోగ్యమైన వ్యక్తి యొక్క లక్షణాన్ని వర్ణిస్తుంది. మానవులు విశ్వవ్యాప్తంగా ఆమోదించే విషయాలు ఉన్నాయి; అనగా సాధారణంగా మానవులందరూ ప్రశంసించదగినదేదైనా.
యూవోదియా, సింటుకే ఇద్దరిలోనూ, వారు ఎంత వరకు దిగజారినా, మెప్పుపొందదగిన లక్శణలను కలిగి ఉన్నారు. “ఒకరి ఎదుగుదలను, ఆధ్యాత్మికతను మీరు ఆమోది౦చలేకపోతే, కనీస౦ ఒకరినొకరు మానవులుగా అ౦గీకరి౦చవచ్చు!” ఇది ఎదుటి వ్యక్తిలో పౌర విలువకు ఆమోదం. పౌలు ఇలా అన్నాడు: “ఒకరిని ఒకరు సహించుచు, ఒకరితో ఒకరు మర్యాదగా నడచుకొనుడి!”
సూత్రం:
ఇతర క్రైస్తవులలో కనీస స్తుతిని కనుగొనాలని దేవుడు ఆశిస్తాడు.
అనువర్తనం:
ఇతరులతప్పును తేలికగా కనుగొనవచ్చు. కనుగొనేందుకు సులభమైన విషయాలలో ఒకటి లోపం. ఎప్పుడూ తప్పులు వెతికే వ్యక్తి కి వేరే ఏమీ దొరకదు. మీ స్వంత వెలుగుకంటే ఎదుటి వ్యక్తి యొక్క కాంతిని ఆర్పడము చాలా తేలిక. ఎదుటి వారిని పొగడడానికి ఏదో ఒకటి దొరకటం చాలా కష్టం.
మీ బద్ద శత్రువు వైపు చూడండి. ఆయనలో “పొగడదగిన” దేదైనా ఉ౦దా? కనీసం, అతనితో మర్యాదగా ఉండండి!