Select Page
Read Introduction to Jude యూదా

 

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.

 

పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,

ఇప్పుడు మనం విశ్వాసి తన క్రైస్తవ జీవితాన్ని బలోపేతం చేసుకొనుటకు రెండవ కార్యమునకు వచ్చాము. పరిశుద్ధాత్మ మన ప్రార్థన జీవితాన్ని ఆసక్తితో కాపాడుతాడు.

పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ఆత్మ నియంత్రణలో ప్రార్థన చేయడము. ఇది ఆత్మ మార్గదర్శకత్వంలో ప్రార్థన. ఇది యాంత్రిక ప్రార్థన కాదు, ఆత్మతో నిమగ్నమైన ప్రార్థన. ప్రార్థన మరియు దేవుని వాక్యం నడుస్తాయి (అపో.కా. 6: 4).

మన ప్రార్థనలను మరింత ఖచ్చితంగా నిర్దేశించడానికి పరిశుద్ధాత్మ మన ప్రార్థన జీవితంలో నివసిస్తాడు (రో 8: 26-28). ఆయన ప్రార్థన ఆత్మ.

దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృిష్టయుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలా పింతురు. జెకర్యా 12:10

నియమము:

పరిశుద్ధాత్మ మనకు సరిగ్గా ప్రార్థన చేయటానికి వీలు కల్పిస్తాడు.

అన్వయము:

ఆత్మలో ప్రార్థన చేసే క్రైస్తవులు తమ ప్రార్థనల దిశను ప్రభావితం చేయడానికి పరిశుద్ధాత్మను అనుమతిస్తారు.

సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును. కీర్త 55:17

ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు. కీర్త 65: 2

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును. మత్త 7: 7

మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మత్త 21:22

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె . ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను లూకా 18: 1

అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అపో.కా. 6: 4

పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అపో.కా. 12: 5

ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. రో 1: 9

ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.  ఎఫె 6:18

… యెడతెగక ప్రార్థనచేయుడి;… 1 థెస్స  5:16

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ 4:16

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. యాకో 5:16

Share