పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి
మీరు వాక్యము నంగీకరించి
“అంగీకరిచి” అనే పదానికి స్వాగతం పలుకుట అని అర్థం. ఉపద్రవ నేపథ్యంలో, వారు సువార్త మాటను స్వాగతించారు.
“ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.” (యోహాను 12: 47-48).
” వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ” (అపొస్తలుల కార్యములు 17:11).
సూత్రం:
జీవము విత్తనంలో ఉంది, విత్తేవారిలో కాదు.
అన్వయము:
జీవము విత్తనంలో ఉంది, విత్తువానిలో కాదు (లూకా 8:11). మనల్ని మనం సువార్తకు గురిచేసినప్పుడల్లా, దేవుడు మన ఆత్మలలో గొప్ప పని చేస్తాడు.