మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
అనింద్యముగాను
“అనింద్యముగాను ” అనే పదం మనపై ఎవరూ అభియోగాలు మోపలేరనే ఆలోచనను సూచిస్తుంది. మనపై ఎవరూ ఆరోపణలు చేయలేరు. మనము నింద లేని వ్యక్తులము.
సువార్త బృందాన్ని వారి జీవితంలో కొంత అస్థిరతకు ఏ థెస్సలొనియన్ నిందించలేడు. ఆ నగరంలో వారి పరిచర్యను ఎవరూ నిందించలేరు. వారు మనుష్యుల దృష్టిలో నింద లేకుండా ఉన్నారు. వారు మోసకరమైన పనులకు అవకాశము ఇవ్వలేదు.
” ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను ” (అపొస్తలుల కార్యములు 24:16).
సూత్రం:
మన సాక్ష్యానికి వ్యతిరేకంగా ఎవరూ నిందారోపణ చేయకుండా మన జీవితాలను గడపాలి.
అన్వయము :
ఇది ఒక అద్భుతమైన విషయం, ఇక్కడ ఎవరూ నమ్మదగిన మరియు వేలుఎత్తి చూపించలేని విశ్వాసులను మనము కనుగొంటాము. మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అనింద్యముగా అనగా పాపము లేనిది అని కాదు. అనింద్యము మనపై వచ్చిన ఆరోపణలతో సంబంధం కలిగి ఉంటుంది.