Select Page
Read Introduction to 1 Thessalonians థెస్సలొనీకయ

 

కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

 

కాబట్టి

ఒకటి నుండి పదకొండు వరకు వచనములలోని సత్యాల వల్ల ఒకరినొకరు యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని పౌలు థెస్సలొనీకయులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

యొకనినొకడు ఆదరించి

క్రైస్తవులు ఇతర క్రైస్తవుల బాధలను చూసుకోవాలి (1 థెస్సలొనీకయులు 4:18). మనం ఇతరులను ఓదార్చడానికి దేవుడు మనలను అదరించాడు. ప్రతి క్రైస్తవునికి ఇది స్పష్టమైన బాధ్యత.

“కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.”(2 కొరింథీయులు 1: 3-4).

క్రైస్తవులు కొనిపోబడుట చూసినప్పుడు, వారు ఒకరినొకరు మరింతగా ఉపదేశించాలి.

“… కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:25).

సూత్రం:

ప్రతి క్రైస్తవుని బాధ్యత ఇతర క్రైస్తవులను ప్రోత్సహించడం.

అన్వయము :

చాలామంది క్రైస్తవులు సంఘమునకు నిరుత్సాహపడి మరియు ఓడిపోయి వచ్చిఉంటారు. కొందరు జీవితం గురించి నిరాశ చెంది ఉంటారు. మన వెచ్చని ప్రోత్సాహం ఆ రోజు వారికి అవసరమైనది కావచ్చు. పాస్టర్ ఆశీర్వాదమును ప్రకటించినప్పుడు, మీరు సమీప తలుపు కోసం ఎదురు చేస్తారా లేదా ప్రోత్సాహం అవసరమయ్యే వ్యక్తుల కోసం మీరు వెళ్తారా?

సంఘము ఎత్తబడుట యొక్క ఆశీర్వాదం ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఇది అందరూ పంచుకోగల సాధారణ ఆశీర్వాదం. పరస్పర సవరణకు ఇది ఒక ఆధారం. ఈ ఆశ వల్ల, క్రైస్తవులు బలమైన ఓదార్పును పొందుతారు.

Share