Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది.

 

దేవుని చిత్తమువలన

పౌలు దేవుని చిత్తమువలన అపొస్తలుడు, తన స్వయం నియామకం ద్వారా కాదు. అతను అపొస్తలుడి పనిని ఎన్నుకోలేదు. మహిమగల  ప్రభువును దర్శించినందున అతను అపొస్తలుడయ్యాడు. క్రైస్తవులను చెరపట్టుటకు అతడు వెళుతుండగా, ప్రభువు అతన్ని బంధించి, సువార్తను తెలియజేయడానికి పంపించాడు.

అతను అపొస్తలుని హక్కును సంపాదించలేదు లేదా అర్హత పొందలేదు. క్రైస్తవ్యములో ఈ ప్రత్యేక ఆధీక్యతలో అతనిని ఉంచడం దేవుని రాజ్యములో స్పష్టంగా ఉంది. ఇది అతని స్వంత యోగ్యత లేదా బలం లేదా సమృద్ధి ద్వారా కాదు. దేవుని సార్వభౌమ ఎంపిక అతని అపొస్తలత్వానికి ఆధారం.

నియమము:

క్రైస్తవుడు తాను చేసేది “దేవుని చిత్తము వలన” చేస్తాడు.

అన్వయము:

ప్రజలు తరచూ తమను తాము హేతుబద్ధం చేసుకుని, “ఇది దేవుని చిత్తం” అని అంటారు. విషయాలు క్షీణించినప్పుడు వారు, “దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? నేను ఈ పరిస్థితిలో ఉండటం దేవుని తప్పు” అని అంటుంటారు. వారి బాధ వారి నుండే వచ్చింది, దేవుని నుండి కాదు.

మరికొందరి సమస్య స్వయంగా ప్రేరేపించబడింది కానీ సాతానును తమ కష్టాలకు నిందిస్తారు. మనము మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుంటాము మరియు అవివేకమైన విషయాలు చెప్తాము, ఆపై సాతానుపై నిందలు వేస్తాము, అయితే అది సాతాను వల్ల వచ్చిన కష్టము  కాదు.

మనమందరం దేవుని చిత్తంతో ఎటువంటి సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటాము. మనము మన స్వంత మూర్ఖమైన తప్పుకు సాతానును నిందింస్తాము. ఉదాహరణకు, ఒక వ్యక్తి “క్రీస్తు పట్ల నా సాక్ష్యం వల్ల నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను” అని అనవచ్చు. కాని అది అతని సాక్ష్యం కాదు, అతను ఉద్యోగాన్ని కోల్పోయాడు ఎందుకంటే అతను ఉద్యోగంలో సోమరిగా ఉన్నాడు. ప్రపంచం తనను చకాలాన్నటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు. అతను తన క్రైస్తవ సేవలో భాగంగా తన ఉద్యోగాన్ని చూడలేదు. ప్రభువుకు చేసినట్టుగా  తన పనిని చేయకుండా, అతను అలసత్వపు పనివాడుగా ఉన్నాడు. దీనికి సాతానుకు సంబంధం లేదు. సాతాను వ్యవస్థ క్రైస్తవులపై దాడి చేస్తుంది కాని ఈ రకమైన సంఘటనలో కాదు.

Share