Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు

 

ప్రభువు ఎవరు, ఏమైఉన్నాడు అనుదానికి అనుగుణంగా ఉన్న జీవితాన్ని మనం కలిగినప్పుడు, మనం “ఆయనను సంతోషపెట్టగలము.”

అన్ని విషయములలో

ప్రభువును సంతోషపెట్టునటఅక్షరార్ధముగా, ఈ పదానికి “ ప్రతీ విషయములలో” అని అర్ధం. మనం ప్రభువుకు ఆనందం ఇవ్వాలని పౌలు కోరుకుంటాడు. “మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీ రేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు.” (I థెస్స 4:1). నిజమైన క్రైస్తవుడు దేవుని అసంతృప్తి పరచుటకు అవకాశము ఉండవచ్చు అని కూడా ఇది సూచిస్తుంది.

ఈ వ్యక్తి లబ్ధిదారుని సంతోషపెట్టడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఈ పదాన్ని భయంకరమైన వైఖరిలో ఉపయోగించదు. “సంతోషపెట్టుట” దేవుని ఆశను తీర్చడానికి ప్రయత్నించుట. ప్రభువు ఇష్టపడే ఏ కోరికనైనా చేయటానికి ఇష్టపడటం. ఇది దేవునిని నిరంతరము సంతోషాపరుచు విధముగా జీవించుట.

మనము ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆశలను గురించి ఆలోచిస్తాము. మనము ఆయనను ప్రేమిస్తున్నాము, మనం ఆయనను ఎలా సంతోషపెట్టగలం? లేఖనాల యొక్క స్పష్టమైన ప్రకటనలకు మించి ప్రభువును సంతోషపెట్టడానికి మనము ప్రయత్నిస్తాము. అంకితభావంతో ఉన్న కొడుకు తల్లిదండ్రులను మెప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లే, మనము దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాము. మనము దేవుని కోరికలను తీర్చుటకు ప్రయత్నిస్తాము, “కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.” (II కొరిం 5:9).

మనుష్యులకంటే దేవునిని సంతోషపెట్టాలని మనము ప్రార్థించాలి. దేవుడు ఏమనుకుంటున్నారో అన్న దానికి వ్యతిరేకంగా మనుషులు ఏమనుకుంటున్నారో అను దాని చుట్టూ మన జీవితాలను గడపడానికి శోధనకు గురియవుతాము. మనుష్యులను సంతోషపెట్టుటను దేవుడు ఖండిస్తాడు (కొలస్సీ 3:22; 1థెస్స 2:4; గల 1:10).

మన జీవితాలతో దేవునిని సంతోషపెట్టడం ద్వారా నాలుగు ఫలితాలు కలుగుతాయి:

-“ప్రతి సత్కార్యములో సఫలులవుతాము” (వ. 10)

-“దేవుని జ్ఞానంలో పెరుగుదల” (వ. 10)

-“సమస్త బలముతో బలపరచబడుతాము” (వ. 11)

-“తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం” (వ. 12)

నియమము:

దేవునిని సంతోషపెట్టడం సాధ్యమే.

అన్వయము:

మీ కోస౦ దేవుడు చేసిన ఏర్పాట్ల విషయ౦లో మీ జీవిత౦ అనుబంధము కలిగి ఉ౦టు౦దా? కాబట్టి మీరు దేవుణ్ణి ప్రీతిపాత్రులుగా ఉన్నారా? దేవునిని సంతోస్ఘాపెట్టుటకు మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? మనము ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టలేము, మనుషులు ఏమనుకున్న ప్రేయభూవును సంతోషపెట్టుట మన లక్ష్యమై ఉండాలి. దేవుడు మీ జీవితమును బట్టి గర్వపడేలా చేస్తారా? మా పిల్లలు క్రీడలలో మంచిగా రాణిస్తే మనము గర్వపడతాం: “అదే నా అబ్బాయి/అమ్మాయి!”అంటాము. మరోవైపున, మనము ఇతరులమధ్య ఉన్నప్పుడు మన పిల్లలు వారి ప్రవర్తన ద్వారా మనల్ని అభ్యంతరపెట్టినప్పుడు, మన౦ వరిని ఉపేక్షి౦చాలనుకోవాలనుకుంటాము లేదా వారు మన పొరుగువారికి చెందినవారుగా అని మన౦ ప్రయత్నిస్తాము. దేవుడు మనలను “సహోదరులు” అని పిలవడానికి సిగ్గుపడడు (హెబ్రీ. 2:11). పరలోకము సంతోషించు విధ౦గా మీరు నడుచుకొనుచారా? మీరు చాలా గొప్ప ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తున్నారా? దేవుడు ఆధ్యాత్మిక కుంటుతనముగల నడవడితో స౦తోషపడడు. మనం చేసే ప్రతిదీ దేవుని మీద ప్రతిబింబిస్తుంది.

Share