Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు

 

క్రైస్తవ జీవితాన్ని స్థబ్దముగా ఉండేలా దేవుడు రూపొందించలేదు. మన ఆధ్యాత్మిక వృద్ధిలో మనం నిశ్చలంగా నిలబడితే, మన జీవితాలు స్థబ్దముగా మారుతాయి. ఇప్పుడు, దేవునిని సంతోషింపజేసే రెండవ ఆధ్యాత్మిక ఫలానికి మనం వచ్చాము.

దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు

 “అభివృద్ధి పొందుచు” అనే పదం క్రైస్తవ జీవితం ప్రగతిశీలమును సూచిస్తుంది. మనము దేవుని గురించి పూర్తి జ్ఞానాన్ని పొందలేము. మనము ప్రతీమారు ఆయన గురించి మరింతగా తెలుసుకోవచ్చు. దేవుని గురించి మనకు ఎంత ఎక్కువ తెలిస్తే మన విశ్వాసం అంతాగా పెరుగుతుంది (I పేతురు 2:2; II పేతురు  1:5-7; 3:18; యూదా 1:20). నూతనజన్మ అనుభవముద్వారా క్రైస్తవ జీవితం ప్రారంభం చేయబడుతుంది. ఆ అనుభవము దేవుని గురించి మరింత తెలుసుకోవటానికి జీవితకాల ప్రక్రియను ప్రేరేపిస్తుంది. మనము దేవుని గురించి మన జ్ఞానములో ” అభివృద్ధి పొందుచున్నప్పుడు” మనము ఆధ్యాత్మిక శిశుత్వం, బాల్యం, కౌమారదశ ద్వారా మరియు అన్ని విషయాలు సరిగా ఉంటే, చివరకు పరిణతి చెందిన ఆధ్యాత్మిక పెద్దలుగా మారుతాము.

పరిపక్వత యొక్క మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి దశకు విశేషమైన ప్రలోభాలు ఉన్నాయి (I యోహాను 2:12-14). మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగకపోతే అది మనకు దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందకపోవుటయే కారణము కావచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడిన  స్థితి మనకు ఉండవచ్చు. మనము మరుగుజ్జుగా ఉన్నాము మరియు ఆధ్యాత్మిక పిగ్మీగా మారాము. దేవుని గురించి మనకున్న జ్ఞానం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండాలి.

ఈ జ్ఞానం కేవలం నైరూప్య జ్ఞానం కాదు, ఒక వ్యక్తిని గూర్చిన జ్ఞానం (హోషేయ 6:3; యోహాను 17:13). దేవునిని తెలుసుకోవటానికి మనం ఆకలిని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలలో గోరుముద్దలు తినడం కొనసాగిస్తే మనం శిశువుగానే ఉంటాం. మనల్ని మనం పోషించుకోవడం నేర్చుకోవాలి. అలా చేస్తే, మనకు దేవుని జ్ఞానం పెరుగుతుంది. దేవుని వాక్య జ్ఞానం పెరగకుండా దేవునిగూర్చిన జ్ఞానాన్ని పెంచుకోడానికి వేరే మార్గం లేదు.

నియమము:

మనం క్రైస్తవులుగా పెరుగుతున్న కొద్దీ దేవుని గురించి మన ఆలోచన గొప్పదిగా ఉండాలి.

అన్వయము:

మీరు క్రీస్తును తెలుసుకున్న రోజు కంటే ఈ రోజు దేవుని గురించిన మీ అవగాహన గొప్పదిగా ఉన్నదా? సృష్టి యొక్క అంతిమ ఉద్దేశ్యం దేవునిని మహిమపరచడం. దేవుడు ఎవరో మనకు తగినంతగా తెలియకపోతే మనం ఎలా మహిమపరచగలం?

Share