Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

 

లేఖన భాగము యొక్క మొదటి భాగంలో, పౌలు మనలను ఎవరు పరిపాలిస్తున్నారు అనే విషయములో ప్రతికూల భాగాన్ని ప్రదర్శించాడు; ఇప్పుడు, అతను సానుకూల వైపుకు తిరిగాడు. సాతాను యొక్క దౌర్భాగ్య రాజ్యం మరియు దేవుని దైవిక రాజ్యం మధ్య మధ్యస్థం లేదు. మనము ఏదొక రాజ్యంలో ఉన్నాము. రెండు రాజ్యాల మధ్య సంబంధము లేదు. దేవుడు మనలను తన రాజ్యంలోకి తక్షణమే మరియు వెంటనే మార్చివేస్తాడు.

తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

“చేసెను” అనే పదానికి అ౦టే ఒక గోప్ప సమూహాన్ని మరో ఆధిపత్యములోనికి బదిలీచేయుట అని అర్థ౦. పరాజితులైన జనాభాను మరో దేశానికి తరలించడం ఒక సాధక సైన్యపు ఆచారం. బబులోను చెరలో ఇస్రాయెలు జనాంగము మెసొపొతమియన్ లోయకు తరలించబడింది. ఇక్కడ క్రీస్తు సాతాను అధినేతల నుండి ప్రజలను తన సొంత ఆధిపత్యము వైపుకు తరలించాడు. విశ్వాసి సాతాను రాజ్య౦ ను౦డి బయటకువిడిపించబడుటయే కాక, పూర్తిగా క్రొత్త రాజ్యానికి తరలించబడ్డాడు. దేవుడు మనలను తన రాజ్యంలోకి మనలను మార్చుటకు ప్రయత్నించడం లేదు; ఇప్పటికే అది చేసేశాడు. క్రీస్తు చేత విడిపించబడ్డాము.

“తన ప్రియకుమారుని రాజ్యము” అనే మాట క్రొత్త నిబంధనలో ప్రత్యేకమైనది. మామూలు వ్యక్తీకరణ తండ్రి రాజ్యముకు సంబంధించింది. ఇది క్రీస్తు వెయ్యేల్ల రాజ్యము కాదు, తన సహస్రాక్ష రాజ్యము వరకు తండ్రి తనకు అప్పగించిన రాజ్యము. అంతమునందు యేసు ఏ సందర్భంలో అయినా తండ్రికి రాజ్యాన్ని ఇస్తాడు (I కొరిం 15:24-28).

యేసు మనలను ఒక పరిధి నుండి తీసి వేరొక పరిధిలో ఉంచాడు. ఆయన మనలను దేవుని యెదుట క్రొత్త స్థితికి తెచ్చారు. మనం ఇప్పుడు సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్నాం. మనము ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము (ఎఫ. 5:8). మనము చీకటినుండి తన అద్భుత వెలుగులోనికి పిలువబడ్డాము (I పేతు 2:9). ఆ రాజ్యము నుండి మనలను బయటకు పంపించగల ఏ ఒక్క పెద్ద దయ్యము లేదా శక్తి లేదు. మన౦ దేవుని రాజ్యనివాసులుగా చేయబడ్డాము.

మనల్ని ఎవరూ ప్రేమించలేదనే భ్రమలో మనలో చాలామంది శ్రమ పడుతున్నారు. ఎ౦దుక౦టే, దేవుడు మనల్ని మనము ఉన్నట్లుగానే బేషరతుగా ప్రేమిస్తున్నాడని, అర్థ౦ చేసుకోవడములేదు

నియమము:

మనం ఎలాంటి ఆధీక్యతలు పొందగలం అనేది తెలుసుకునే ముందు మనం ఎంత సంపన్నులమో తెలుసుకోవాలి.

అన్వయము:

కాడిలాక్ ని పొందే స్తోమత లేనప్పుడు మనం ఎందుకు చెవరెట్ ని డ్రైవ్ చేయాలి? మన విలువ ఏమిటో మనకు తెలియక పోతే, మన కోసం దేవుని ఏర్పాట్ల అడుగు స్తాయిలో బ్రతుకుతాము. అన్ని కార్లు చెవరెట్ లాగానే డ్రైవ్ చేస్తాయని అనుకొంటాం. దేవుని కృప యొక్క మృదువైన రహదారి మీద కాకుండా ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డుపై మన క్రైస్తవ జీవితాన్ని గడుపుతాము. ఒకసారి మనం ఒక కాడిలాక్ రైడ్ చేస్తే తేడా తెలుస్తుంది. ఒక్కసారి మనం కృపలో జీవిస్తే మనకు తేడా తెలుస్తుంది. రహదారులన్నీ మరమ్మత్తు  చేసారని అనుకుంటాము!

మన ఆధ్యాత్మిక బ్యాంకు పుస్తకము పరిశీలించడం చాలా ముఖ్యం. చాలామ౦ది దేవుని వాక్యాన్ని పరిశీలి౦చడ౦ ద్వారా తమ ఆధ్యాత్మిక వృత్తా౦తాన్ని ఎన్నడూ చూసుకోరు. దేవుడు మన ఖాతాకు ధనాన్ని పెట్టి ఉంటే, దానిని ఉపయోగించకపోవడం ద్వారా ఆయనను అవమానించిన వారమవుతాము.

Share