Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు

 

ఈ వచనములో క్రీస్తు యొక్క రెండవ వర్ణన సృష్టితో అతని సంబంధం – ఆయన “సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.”

సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు

ఇది యేసు క్రీస్తు సృష్టి గురించిన ప్రకటన కాదు ఎందుకంటే ఆయన తనను తాను సృష్టించుకోలేడు. ఆయన ప్రాణి కాదు. సమస్తమును సృజించినవాడు (యోహాను 1:3; హెబ్రీ. 1:2, 3). ఆయన నిత్యత్వమునుండి ఉన్నవాడు, నిత్యమూ ఉండువాడు (సామెతలు 8:23-26). ” ఆదిసంభూతుడై” అను మాట అన్ని విషయాలపై తన అధినివేశం సూచిస్తుంది. ఇశ్రాయేలులో జ్యేష్ఠులకు పరిపాలించే హక్కు ఉండేది. సృష్టికార్యాలన్నిటికి ఆదిసంభూతుడు కాబట్టే యేసుకు పాలించే హక్కు ఉంది. ఆయనే సృష్టికి సార్వభౌముడు. ” ఆదిసంభూతుడై” అనే పదానికి మొదటి క్రిస్మస్ తో సంబంధం ఏమీ లేదు. యేసు బేత్లెహేము దగ్గర ప్రార౦భి౦చాడు అని బైబిలు ఎక్కడా బోధించట్లేదు. అతని భౌతిక కాయం అక్కడ మొదలయ్యింది కానీ తన వ్యక్తిత్వము కాదు. ఆయన నిత్యమును౦డి ఉన్నాడని బైబిలు బోధిస్తో౦ది (మీకా 5:2; యెషయా 9:2). శిశువు పుట్టెను కానీ కుమారుడు అనుగ్రహింపబడెను. సృష్టికి ముందు ఉనికిలో ఉండేవాడు (యోహాను 1:1-3, 14). ఈ లేఖన భాగము ఒక జీవి వలె తన పుట్టుక గురించి మాట్లాడటం లేదు కానీ దేవునిగా తన ఉనికిని తెలుపుతుంది.

 “ఆదిసంభూతుడు” అంటే సృష్టి కంటే ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన సృష్టికి ముందు నుండి ఉన్నాడు, గనుక ఆయన దానిపై సార్వభౌమత్వం కలిగి ఉన్నాడు. ఈ పదంలో సార్వభౌమాధికారం ఉంది. పాత నిబంధన మెస్సీయను సూచించడానికి “ఆదిసంభూతుని” అను మాటను ఉపయోగించింది (కీర్త. 89:27). యేసు సృష్టికి (సమయంనకు) ముందుగా ఉన్నవాడు మరియు సర్వ సృష్టి పై సార్వభౌముడు (ఆధిపత్యము).

తండ్రితో కుమారుని శాశ్వత సంబంధం ఇక్కడ కనిపిస్తుంది. యేసు ప్రాధాన్యతలో మొదటివాడు (సృష్టి కంటే ప్రముఖుడు) మరియు ఆయన సృష్టిని కూడా ఉత్పత్తి చేశాడు.

ఐదుసార్లు ప్రభువు “ఆదిసంభూతుడు” అని పిలువాబడ్డాడు (1:15,18; రోమా. 8:29; హెబ్రీ. 1:6; ప్రక. 1:5). 1:18 లో ఆయన మృతులలోనుండి లేచుటలో “ఆదిసంభూతుడై”; ఇది ఆయన పునరుత్థానమును తెలుపుచున్నది. మృతులలోనుండి లేచిన మొదటి వ్యక్తి ఆయన. అతను సరికొత్త సృష్టికి మొదటి వాడు. ఎందుకంటే ఆయన మృతులలోనుండి లేచాడు, ఆయనపై విశ్వసించిన వారందరూ మృతులలోనుండి కూడా లేస్తారు. ఆయన పునరుత్థానం ఒక సరికొత్త సమాజాన్ని ప్రారంభించింది; ఆయన పునరుత్థానంతో నూతన సృష్టి ప్రారంభమైంది.

 “సర్వము” అనే పదాన్ని మళ్ళీ గమనించండి. సర్వ సృష్టిలో కుమారుని సార్వభౌమత్వం లేనిది ఏదీ లేదు.

నియమము:

యేసుకు ప్రత్యర్థులు లేరు; ఆయనకు ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యతలో సవాలుచేగలవారు లేరు.

అన్వయము:

మీ రోజువారీ నిర్ణయాలలో యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యతను మీరు అంగీకరిస్తున్నారా?

Share