Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను.

 

లైకస్ లోయలోని సంఘమునకు గొప్ప ప్రమాదం ఎదురైంది. గ్నోస్టిసిజం అని పిలువబడే ఒక తప్పుడు సిద్ధాంతం అక్కడి సంఘములపై దాడి చేసింది. ఈ సిద్ధాంతం క్రీస్తు వ్యక్తిని అభూతకల్పనగా చిత్రీకరిస్తూ ఆయన ఒక వాస్తవ వ్యక్తి అనే భావనను ఉల్లంఘించింది. ఆందోళన కలిగించిన ఇతర సిద్ధాంతాలు న్యాయ పరాయణత్వం మరియు శరీర సన్యాసం. ఈ సిద్ధాంతాలన్నీ క్రైస్తవ్యముకు, కీలకమైన క్రైస్తవ జీవనానికి ముప్పు తెస్తాయి. సంఘమును ఉల్లంఘించడంకోశము  సాతాను చేసిన గొప్ప ఎదురుదాడి అది.

స్పష్టంగా ఈ దాడి కొంతమేరకు క్రైస్తవ్యములోకి ప్రవేశించింది మరియు కొలస్సీ మరియు లావోదొకయాలోని విశ్వాసులు ఈ దాడికి లొంగిపోయారు. జ్ఞానవాదం చాలా మంది ఆధ్యాత్మిక బందీలను చెరగొంది. చాలామంది వారి రక్షణను అనుమానించారు. వారు సాతాను ఎదురుదాడికి బలి అయ్యారు. దాని కారణంగా మరింత పరిణతి చెందిన వారు నిరుత్సాహపడ్డారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, నిరాశకు గురయ్యారు మరియు చెల్లాచెదురయ్యారు.

ఈ అధ్యాయంలో పౌలు ఈ తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ క్రీస్తు అధిగమిస్తున్నాడని వాదించాడు. మనం ఎదుర్కొనే దేనికైనా ఆయన పూర్తిగా సరిపోతాడు.

మీరు తెలిసికొనగోరుచున్నాను.

పౌలు ఈ పదబంధాన్ని ఉపయోగించినప్పుడల్లా అది ప్రాముఖ్యత గల ప్రకటనను సూచిస్తుంది. తప్పనిసరిగా, మనకు తెలియవలసిన విషయం మనకు తెలియనిదియై ఉంటుంది .

ఇక్కడ సంఘస్తులపట్ల ఎంత శ్రధ్ధ పౌలు కలిగిఉన్నాడో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, “నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను.” అతను రచయిత, మిషనరీ, సంఘ స్థాపకుడు, సువార్తికుడు మరియు ఉపాధ్యాయుడు అయినప్పటికీ, అతనికి కాపరి హృదయం ఉంది.

అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. (1 థెస్స 2:7,8)

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము. (2కొరిం 5:14,15)

ఇతరుల క్షేమము పట్ల ఆసక్తికి ప్రేరణ, యేసు మన పట్ల చూపిన ప్రేమ.

నియమము:

క్రైస్తవులు ఇతరుల కోసం జీవించడం దేవుని ధృష్టిలో గొప్ప విలువైన విషయము’.

అన్వయము:

స్వభావికముగా ప్రజలు తమను తాము ప్రేమించుకుంటారు. మనము సహజంగా లోపలివైపు శ్రధ్ధ కలిగిఉంటాము. ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అతను ప్రజల క్షేమముకోరే క్రొత్త హృదయాన్ని పొందుతాడు. మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ఇతరుల క్షేమము పట్ల శ్రధ్ధ కలిగిన గొప్ప బాహ్య ధోరణిని ప్రారంభిస్తాడు. క్రీస్తు మనలను మొదట ప్రేమించినందున మనం ఇతరులను ప్రేమిస్తున్నాము.

Share