Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

క్రైస్తవ్యముపై దాడికి వ్యతిరేకంగా మొదటి భద్రత వలయము సత్యము. వాక్యసత్యం విశ్వాసిని బలపరుస్తుంది (ప్రోత్సహిస్తుంది).

తమ హృదయములలో ఆదరణపొందవలెనని

సరైన వాక్య  బోధన తరువాత, క్రైస్తవుడు ఆధ్యాత్మిక క్షేమఅభివృద్ధి పొంది, తద్వారా అతను తన విశ్వాసానికి కలుగు ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలడు. ఉదాహరణకు, మనము 1 పేతురు 5:7 లోని వాగ్దానాన్ని ఉపయోగిస్తే, “మీ చింత యావత్తు ఆయనపై వేయుడి. ఆయన మీనిమిత్తము చింతించుచున్నాడు ”, అప్పుడు మనము ఈ మొదటి రక్షణ కేడము వెనుకకు వెళ్తాము. మనం పడిపోయి, భావోద్వేగ సానుభూతి కోసం చూస్తే, సాతాను మనలను బందీగా తీసుకోవచ్చు.

మనందరికీ బాధలు ఉంటాయి. మన బాధలను మనము ఎలా ఎదుర్కుంతాము అన్న విషయములో వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. కొంతమంది తమను బాధపెట్టిన వ్యక్తుల నుండి తమను తాము దాగుకుంటారు. వారు తమను తాము అలా వేరుచేసుకొనినప్పుడు, వారు వైఖరికి సంబందించిన సమస్యలలో మునిగిపోతారు. వారు తమ స్నేహితులను దూరం చేసుకుంటారు. వారు అలుగుతారు. వారు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. ఎవరైనా వారితో సంబాషణ చేయడానికి ప్రయత్నిస్తే, వారు ముందుకురారు. వెంట వచ్చే ఎవరికైనా వారు చిరాకు కలిగిస్తారు మరియు క్రూరంగా ఉంటారు.

మీరు ఆ రకమైన వ్యక్తినా? మీరు బుసలుకొట్టి మరియు కాటు వేస్తున్నారా? మీరు మీ స్నేహితులపై కోపపడుతున్నారా? మీరు ఆ రకమైన వ్యక్తి అయితే, మీరు రక్షణ యొక్క మొదటి వరుస వెనుక లేరు.

నియమము:

దేవుని వాక్యం ఆత్మ యొక్క క్షేమాభివృధ్ధి  నిర్మాణాన్ని చేస్తుంది.

అన్వయము:

హృదయం సానుభూతితో ప్రోత్సహించబడదు. ప్రతికూల వైఖరులున్న వ్యక్తులతో సానుభూతి పొందడం మనం చేయగలిగే ఘోరమైన పని. ఇది వారి అభివృద్ధి చెందుతున్న స్వీయ-జాలిని నిర్ధారిస్తుంది.

మనము వారికి చేయగలిగే గొప్పదనం ఏమిటంటే, దేవుని వాగ్దానాలవైపు వారిని మళ్లించుట. ప్రతికూలతకు సత్యాన్ని వర్తించే వరకు ఆ విశ్వాసి ఎప్పటికీ దేవుడు అతనిపట్ల కలిగిన సంకల్పములోనికి రాలేడు. మన తరం క్రైస్తవులు సమస్యలను పరిష్కరించడానికి దేవుని వాక్యానికి తప్ప దాదాపు ఎక్కడైనా వెళతారు. మనకు ఏ సమస్య వచ్చినా దేవునికి తప్ప మరెవరికీ అంత స్పష్టముగా తెలియదు. ఆయన మనకు ఇచ్చిన వనరులను మనం ఉపయోగించుకోవాలి మరియు వాటిని మన పరిస్థితికి వర్తింపజేయాలి. మనము అలా చేస్తే, మనం నిరంతరం ఇతరుల నుండి సానుభూతి పొందవలసిన అవసరం ఉండదు. మనము బాధితులుగా బాధపడవలసిన అవసరం లేదు. ప్రతిఒక్కరూ మన దగ్గరికి వచ్చినప్పుడు మేము వారిని మరింత భాధపెట్టే అవసరం లేదు. మనము విశ్రాంతి తీసుకోవచ్చు. మన సమస్య గురించి ప్రజలకు తెలిసినా తెలీకపోయినా పెద్ద తేడా లేదు; దాని గురించి దేవునికి తెలుసు. ఆయనపై మీకున్న నమ్మకాన్ని ఆయన గౌరవిస్తాడు. మనకు ఇంతకు ముందెన్నడూ తెలియని ప్రభావం ఉంటుంది.

Share