Select Page

 

మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు

 

పౌలు విశ్వాసికి క్రీస్తు యొక్క సమర్ధతపై తన ప్రాధాన్యతను కొనసాగిస్తున్నాడు. ఈ విభాగం క్రీస్తుతో విశ్వాసి యొక్క అనుబంధ ఫలితాలను ప్రారంభిస్తుంది. మొదటి ఫలితం ఏమిటంటే, మనం “ఆయనయందు సంపూర్ణులమై  యున్నాము”.

మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు

‘మీరు జీవితపు సంపూర్ణతకు చేరుకున్నారు’ అనే పదబంధాన్ని మనము అనువదించవచ్చు. గ్రీకు భాషలో ప్రాముఖ్యత క్రీస్తులో మన స్థానం యొక్క స్థిరమైన ఫలితాలపై ఉంది. విశ్వాసి రక్షణపొందిన క్షణం నుండి దేవుని ముందు ఆ స్థానాన్ని శాశ్వతంగా కలిగి ఉంటాడు.

‘ సంపూర్ణులై యున్నారు ‘ అనే పదాలు 9 వ వచనం యొక్క ‘సంపూర్ణత’ అనే పదం నుండి వచ్చాయి. ఇది క్రీస్తు సంపూర్ణత్వానికి స్పష్టమైన సూచన. క్రైస్తవులు క్రీస్తు సంపూర్ణత్వం నుండి నిండి ఉన్నారు – ‘దైవత్వముయొక్క సంపూర్ణత్వం’ క్రీస్తులో శాశ్వతంగా జీవిస్తుంది. ఈ వచనము దేవుడు విశ్వాసులకు తనలోని సంపూర్ణతను ఇచ్చాడని చెబుతుంది. మన జీవితపు సంపూర్ణత క్రీస్తు సంపూర్ణత్వం నుండి వచ్చింది (యోహాను 1:16). మరే ఇతర మూలం నుండి మనకు బయటి సహాయం అవసరం లేదు. మనకు అనుబంధ జ్ఞానం అవసరం లేదు.

రక్షణపొందు సమయంలో ప్రతి క్రైస్తవుడు ఈ సంపూర్ణతను పొందుతాడు. ఇది మన గురించి దేవుని అంచనా. దేవుడు మనలను క్షమొంచబడినవారిగా, క్రీస్తు వలే నీతిమంతులుగా భావిస్తాడు. మనము ఆయనతో జీవితంలో, కుమారత్వములో, వారసత్వంలో, కీర్తియందు మరియు యోగ్యతయందు పాలివారుగా ఉన్నాము. రక్షణ పొందు సమయంలో దేవుడు దీనిని నెరవేరుస్తాడు మరియు మనం దేవుని సన్నిధిలో నిలబడే వరకు ఇది నిజం. వాయిదాల ప్రణాళికలో మనము క్రీస్తును స్వీకరించము. మనము అతనిని తెలుసుకున్న తరుణంలో సంపూర్ణ రక్షకుని స్వీకరించి, రక్షణ యొక్క సంపూర్ణ ఫలితాలను అందుకుంటాము. మనం ఆయనలో పెరిగేకొద్దీ మనం అతన్ని ఎక్కువగా అభినందిస్తాము, అయినప్పటికీ, మనం ఆయననుండి ఎక్కువగా స్వీకరించము.

‘ఆయనయందు’ అంటే యేసుక్రీస్తుతో ఐక్యపరచబడుట. ఇది దేవుని ముందు విశ్వాసి యొక్క స్థానం. దేవుడు మనలను చూస్తున్నప్పుడు, ఆయన క్రీస్తును చూస్తున్నట్లుగానే మనలను చూస్తాడు – పరిపూర్ణులుగా. మన అనుభవంలో మనం పరిపూర్ణంగా లేము కాని మన స్థానం లేదా యథాతథ స్థితిలో దేవుని ముందు శాశ్వతంగా ఉంటాము. మనము అతనియొక్క సంపూర్ణతను పంచుకుంటాము. దేవుని దృక్కోణంలో, క్రీస్తు వల్ల మనలో అవసరమైనది ఏది లేదు. మన కొరకు దేవుని ప్రతి డిమాండ్ను యేసు పూర్తిగా తీర్చాడు.

క్రీస్తులో దేవుని ముందు మనకు కావలసిందల్లా ఉంటే, కొలొస్సయులు జ్ఞాన తత్వశాస్త్రం వైపు ఎందుకు తిరగారు? ఈ రోజు క్రైస్తవులు వివిధ రకములైన సిద్దాంతములవెనుక ఎందుకు పరుగెత్తుతున్నారు?

ప్రతి క్రైస్తవుడి జీవిత అనుభవం ఎలా ఉన్నా ఇది నిజం. యేసుక్రీస్తు రక్షణను పొందు సమయములో మాత్రమే కాదు, దేవుని ముందు కొనసాగుతున్న స్థితిలో మనకు ప్రత్యామ్నాయంగా ఉంటాడు. మనము దేవుని ముందు శాశ్వతంగా న్యాయంగా నిలబడతాము. మన గురించి దేవుని అంచనా క్రీస్తు గురించి ఆయనకలిగిఉన్న అంచనాకు సమానం. దేవుడు సమస్తములో మనలను ఆయనతో గుర్తిస్తాడు.

నియమము:

క్రీస్తులో దేవుని ముందు మన స్థానాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువును మహిమపరచడానికి మనకు స్వేచ్ఛ కలిగిఉంటాము. భద్రత విశ్వాసి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి స్వేచ్ఛను అనుమతిస్తుంది.

అన్వయము:

మనం చట్టబద్ధత యొక్క కాడి కింద ఉన్నంత కాలం ప్రభువును మహిమపరచడానికి మనకు స్వేచ్ఛ లేదు. ప్రభువును ప్రేమించే మరియు గౌరవించే మన సామర్థ్యం మన ప్రయత్నం మరియు నైతికతపై ఆధారపడి ఉండదు. అది ఆయన చేసిన కార్యమును గుర్తించూటపై ఆధారపడి ఉంటుంది. స్థాన సత్యం మనకు దేవుని పట్ల స్వేచ్ఛను ఇస్తుంది. మన స్వేచ్ఛకు ఆధారం మనం చేసేది కాదు, క్రీస్తు ఏమి చేసాడు అనేది మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తును సేవించడానికి మనం స్వేచ్ఛగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకోసం ఏమి చేశాడో మనకు అర్థం కాకపోతే ఆయనను ప్రేమించి, గౌరవించే స్వేచ్ఛ మనకు ఉండదు.

Share