Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.

 

క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి

“స్థిరమైన” అనే పదం యోధుల సమూహము అను సైనిక పదముకు సంబంధించింది. ఒక పాలంక్సు దళం యొక్క పురాతన గ్రీకు నిర్మాణం. సైనికులను ఎనిమిది నుండి పదహారు వరుసల వరుసలలో అమర్చుతారు. ఈ సమూహము మరింత చెదరగొట్టబడిన శత్రువు మూకను తుడిచిపెట్టగలదు. ఫలాంక్స్ మొదట స్పార్టాన్స్ చేత మోహరించబడింది. దీనిని ఎబమినోడాస్ ఆఫ్ థెబ్స్ (362 B.C.) అభివృద్ధి చేసాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆధ్వర్యంలో ఈ యుద్ధ పద్ధతి దాని శిఖరానికి చేరుకుంది. అతను మాసిడోనియన్ ఫలాంక్స్ (16 మంది సైనికులు 24’ఈటె వంటి ఆయుధాలు) ఉపయోగించారు. ఈ యుద్ధ విధానంతో అతను గ్రీస్ మరియు నియర్ ఈస్ట్ మొత్తాన్ని జయించాడు.

క్రైస్తవుడు వాక్యములో స్థిరమైన యోధుడు. క్రైస్తవ ఫలాంక్స్ విడదీయలేని చతురస్రం. ఇది శత్రువు యొక్క అభియోగానికి వ్యతిరేకంగా దృఢముగాని లుస్తుంది. నిజమైన సంఘము తన విశ్వాసం యొక్క ఫలాంక్స్కును గట్టిగా పట్టుకుంటుంది. నిజమైన విశ్వాసం వ్యతిరేక ప్రభావాలకు లొంగడానికి నిరాకరిస్తుంది.

నియమము:

క్రైస్తవులు యేసుక్రీస్తు దళసభ్యులుగా క్రమబద్ధమైన స్తానములలో మరియు దృఢ క్రమశిక్షణను ప్రదర్శించాలి.

అన్వయము:

మీ విశ్వాసకర్తయైన యేసుక్రీస్తుకు విధేయతచూపుటకు మీరు ఎంత గట్టిగా కట్టుబడి ఉన్నారు? మీ ప్రేమ అతని నుండి ఎప్పటికీ చలించదా? యేసు క్రీటు యొక్క అధికారం నుండి ఏ క్రైస్తవుడు విముక్తి పొందలేదు. మనము అతని అధికారాన్ని తిరస్కరించినప్పుడు, మన ఆత్మకు ఉత్తమమైనదాన్ని తిరస్కరించువారమౌతాము. అప్పుడు మన ఆత్మలలోని శూన్యత కోసం మత్తు పదార్ధాలు మరియు ఆల్కహాల్ ను ప్రత్యామ్నాయంగా చేస్తాము. మనము యేసుక్రీస్తు స్థానములో ఇతర విధానాలను ప్రత్యామ్నాయంగా చేసినప్పుడు, మనము అతనితో సభ్యత్వ స్థానమును విచ్ఛిన్నం చేసినవారమౌతాము. మీరు దేవుని వాక్యంతో సభ్యత్వ స్థానమును ఉన్న సైనికులవలే ఉన్నారా?

Share