శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము
” ఆ శిరస్సుమూలముగా” అనగా యేసు క్రీస్తు మూలముగా(వ. 19). ఆయన శరీరము యొక్క జీవము, ఎదుగుదలకు మూలం.
“శరీరము” సంఘము. సంఘము భూమిపై ఉన్నప్పుడు అది క్రీస్తు యొక్క “శరీరము” అని పిలువబడుతుంది. క్రీస్తు సంఘమును కొనిపోవుటకు వచ్చినప్పుడు, దానిని క్రీస్తు యొక్క “వధువు” అంటారు. సంఘము ఇప్పుడు వధువు కాదు.
“శరీరము”గా సంఘము అనేది సార్వత్రిక సంఘము. ఈ సంఘము భూమిపై ఉన్న ప్రతీ విశ్వాసి.
పోషింపబడి
“పోషణ” అంటే, ఒక వ్యక్తి అవసరాలకు సహాయం చేయడానికి లేదా సరఫరా చేయడానికి అవసరమైన వాటిని అందించడానికి, మద్దతు, అవసరం, సదుపాయం, పూర్తిగా, సమృద్ధిగా సరఫరా. ఇది ప్రాచీన నాటకంలోని ఒక పదంగా ఉండేది.
ఈ పదము నుండి మనం వాడే “కోరస్” అను మాట వచ్చింది. ప్రాచీన గ్రీకు ప్రప౦చ౦లోని ఒక సంపన్న పోషకుడు ఖరీదైన కోరస్ పని చేయడానికి అవసరమయ్యే డబ్బును సరఫరా చేసేవాడు. కావలసినవన్నీ ఇచ్చేవాడు. శిక్షణ, ఖర్చు మరియు స్టేజింగ్ కోసం ఖర్చులను అతను భరించాడు. గొప్ప నాటకకర్తలైన యురిపిడీలు, సోఫోల్స్ వంటి గొప్ప నాటక కర్తలు మహా ఉత్సవాల్లో నాటకాలు ప్రదర్శించారు. ఈ నాటకం తెరముందు ఒక సంవత్సరం పాటు తరచుగా శిక్షణ ఉంటుంది. . సాధారణంగా వీరు దేవతల జ్ఞాపకార్థం ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది ఒక బహిరంగ ప్రదర్శన కోసం అన్ని కావలసిన డబ్బును ఎవరో దాతృత్వం చేయడము వంటిది. అది దయను గూర్చిన మాట.
దేవుడు ఇక్కడ పోషకుడు. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఆయన ముందు మనం జీవించడానికి ఎదురయ్యే ఏ ఖర్చులనైనా ఆయన సమర్థింస్తాడు.
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును. (1కొరిం 9:10)
ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు? (గలతీ 3:5)
తల నుంచి ప్రాణం వస్తుంది. దేవుడు విశ్వాసుల ద్వారా,తలాంతులు గల మనుష్యులు (“కీళ్ళు, నరములు”) చేత తమ ఆధ్యాత్మిక వరముల ద్వారా ఆ జీవాన్ని శరీరమ౦తటా ప్రవహింపజేస్తాడు. పరిశుధ్ధులు పరిచర్య చేస్తారు, నైపుణ్యాలు గలవారు కాదు. ఇవన్నీశిరస్సును హత్తుకొనుటవలన కలుగు ఫలితాలు.
నియమము:
దేవుడు మనము క్రైస్తవ జీవితము జీవించడానికి అవసరమైన అన్నింటిని సమకూర్చు కృప గల దేవుడు.
అన్వయము:
మీ శక్తిమీద క్రైస్తవ జీవిత౦ ఆధారపడివు౦టు౦ది అని మీకు అనిపిస్తు౦దా? మీ అవసరాన్ని తీర్చే కృపగల దేవుడిగా మీరు దేవుని వద్దకు సమీపిస్తారా ?