శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
అతుకబడినదై
” అతుకబడినదై” అంటే, కలిసి ఉండటం, కలిసిపోవడం, ఏకం చేయడం, కలపడం. ఇది తరచుగా “బోధించు” లేదా “ఉపదేశించు” అని అనువదింపబడింది. ఒక అభిప్రాయానికి రావటానికి అనేక ఆలోచనలను కలిపి తీసుకుని వచ్చుట అని అర్థం.
ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. (ఎఫెస్సీ 4:15,16)
ఇది మన వచనానికి ఒక సమాంతర భాగము. ఇక్కడ “కీళ్ళు మరియు నరములు” అనేవి, పరిచర్య కోసం పరిశుధ్డులను సిద్ధపరచుటకు క్రీస్తు ఇచ్చిన వారు. అపొస్తలులూ, ప్రవక్తలు, సువార్తికులు, కాపరి-బోధకులు వ౦టి వరములు గల వారు పరిచర్య కోస౦ పరిశుద్ధులను సన్నద్ధం చేస్తారు.
నియమము:
వరములుగల వ్యక్తులు సత్యపు పోషణను సంఘమునకు అందజేయడం ద్వారా సంఘము అత్యుత్తమంగా పనిచేస్తుంది.
అన్వయము:
వరములుగల వ్యక్తులు సత్యపు పోషణను సంఘమునకు అందజేసినప్పుడు సంఘముజ్ ఐక్యతలో బలపడుతుంది. వరములు క్రీస్తు శరీరమునకు క్షేమాభివృధ్ధి ఆరోగ్యదాయకమైన సంఘములో మీరు ఉన్నారా?