అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.
వినయ విషయములోను
న్యాయవాదము ఒక విధమైన వినయాన్ని కలిగి ఉంటుంది కానీ అది ఒక ప్రదర్శన మాత్రమే. నిజమైన జ్ఞానము మనలను దేవుని కృపకు దగ్గరగా ఉంచుతుంది. ఇది స్వీయ ప్రేరిత బూటకపు నమ్రత. నిటారుగా నిలబడి లేదా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన, కొన్ని రకముల మతసంబంధులు వారి ఆత్మవిశ్వాసముకు కోపపడుతారు. మరోవైపున, మన౦ ఇతరులకంటే తక్కువగా కనబడి, మన౦ నిస్సహాయుల౦ అని ప్రజలకు అనిపిస్తే వారు మనకు సహాయ౦ చేయడానికి ప్రయత్ని౦చకు౦డా పోతారు. ఇది స్వీయ-ప్రభావంపై ఆధారపడి ఉంటుంది.
నియమము:
ఇది వినయమును అణిచివేయు ఒక అహంకారం.
అన్వయము:
ఒకవేళ మనకు విషాదకరమైన మనసు ఉన్నా, నిటారుగా నిలబడకపోతే, మన౦ బలహీన౦గా, దయనీయంగా కనిపి౦చినప్పుడు ప్రజలు తమ వెంట వచ్చి, “దాని గురి౦చి చి౦తపడకండి. మీకు సహాయం చేస్తాం” అని అంటారు. ఈ బూటకపు -ఆధ్యాత్మికత అబద్ధపు వినయాన్ని విజ్ఞప్తి చేస్తోంది. మనం ఎప్పుడైనా ఎవరి నుంచి ఏమైనా కావాలనిపిస్తే, మనం చేయాల్సిన పని అంతా నిస్సహాయులుగా నటించడం, అప్పుడు దానిని మనం పొందుతాం. కొందరు వ్యక్తులకు సహాయపడటానికి ఇష్టపడుతారు, ఎందుకంటే ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అది వారి అనేక అపరాధ భావాలను పూరిస్తుంది.
నిజమైన ఆధ్యాత్మికతపై పనిచేసే క్రైస్తవుడు బూటకపు వినయ౦ చూపి౦చడు. క్రైస్తవ జీవితానికి దైవిక నిర్వహణా వనరులను అ౦దిస్తున్న దేవుని పట్ల తన వినయ౦ చూపిస్తాడు.