ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును
పౌలు తుకీకును మూడు విధాలుగా వివరించాడు. మొదట అతన్ని “ప్రియమైన సోదరుడు” అని పిలుస్తాడు.
ప్రియసహోదరుడును
క్రైస్తవులలో ప్రాథమిక సంబంధం “సోదరుడు”. తుకీకు కేవలం “సోదరుడు” కంటే అతను “ప్రియమైన సోదరుడు”. జైలులో ఉన్న అపొస్తలుడితో తనను తాను ప్రియమైన వానిగా రుజువుచేసుకున్నాడు. సోదరుడిగా ఉండటం ఒక విషయం, ప్రియమైన సోదరుడు కావడం మరొకటి.
కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి (ఫిలిప్పీ 4:1)
ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము. (2థెస్స 2:13)
తుకీకుకు సన్నిహితులు ఆయనను ప్రేమించారు. సహవాసము విషయానికి వస్తే అతను “ప్రియమైనవాడు”.
నియమము:
పరిచర్యలో మన తోటి పరిచారకులను ప్రేమించాలని దేవుడు ఆశిస్తాడు.
అన్వయము:
పౌలు తన సహచరులను ఎంతో ప్రేమించాడు. మనం పరిచర్యలో పనిచేసే వారిని ప్రేమించాలని దేవుడు ఆశిస్తాడు.