Select Page
Read Introduction to James యాకోబు

 

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

 

యాకోబు పత్రికలోని మొదటి వచనములొ సాంప్రదాయబద్దమైన నమస్కారము (వందనము) ఉన్నది.

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు

యాకోబు తనకుతానుగా “ప్రభువుయొక్క తోబుట్టువుగానో లేక యెరూషలేము సంఘము యొక్క నాయకుడుగానొ పరిచయము చేసుకొవడంలేదు గాని, దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడుగా పేర్కొంటున్నాడు. తన తోబుట్టువుకు దాసుడుగా తనను చూసుకుంటున్నాడు.  మరియకు ఆరుగురు సంతానము.

క్రీస్తుయొక్క దైవత్వానికి పూర్తి గౌరవాన్ని ఆపాదిస్తున్నాడు. క్రీస్తును దేవునిగా గుర్తిస్తున్నాడు. ఆ వచనమును “దేవునియొక్కయు ఇంకా యేసుక్రీస్తుయొక్కయు”  అని తర్జుమాచేయవచ్చు.   

యాకోబు యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరుడు (మత్తయి 1:25; 12:46-47; లూకా 8:19-21; యోహాను 2:12; గలతీ 1:19) . యేసుయొక్క ఇతర సోదరులు యోసే, సీమోను, యూదా.  మార్కు, యేసుకు సొదరీమనులు ఉన్నట్లుగా తెలియజేస్తున్నాడు (మార్కు 3:31-35). అతని సొదరులు మొదట్లో  ఆయనను విశ్వసించలేదు. ఆయన మతి చలించియున్నదని  భావించరు.  

యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక  ఆయన సహోదరులు ఆయనను చూచినీ వు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.  బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.  ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. (యోహాను 7:2-5).

పునరుర్థానము యేసు యాకోబుకు ఉన్న అభిప్రాయము మార్చివేసింది .  (అపో 1:13,14; 1 కొరిం 15:7). పునరుర్థానము తర్వాత, యేసు స్వయముగా యాకోబుకు అగపర్చుకున్నాడు. అప్పటినుండి యాకోబు ఆయనను విశ్వసించి, తదుపరి యెరూషలేము సంఘముకు నాయకుడయ్యాడు. (అపో 12:17; 15:1; 21:17–18; గలతీ  2:9-12).    జోసెఫస్ ప్రకారము, యాకోబు క్రీ.శ. 62 కాలములొ హతసాక్షి అయ్యాడు.

అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి.

“అన్యదేశములయందు చెదిరియున్న” అన్న పదము గ్రీకు భాషలో “వెదజల్లబడుట” . ఈ పదము మొదట అన్యుల దేశములలో చెదరిన యూదులకు ఉపయోగించబడింది. డియస్పోరా (యోహాను 7:35). ఈ వెదజల్లబడుట క్రీ.పూ. ఆరవ శతాబ్దములో యూదులు బాబులోనుకు చెరగొనిపోయినప్పుడు ఆరంభమైంది.

ఈ సంధర్భాములో “చెదరినవారు” అనగా, రోమా సామ్రాజ్యములో  క్రైస్తవ యూదులు. ఆ పండ్రెండు గోత్రములు యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇశ్శాకారు, జెబూలూను, యోసేపు మరియు బెన్యామీను.

శుభములు

  “శుభము” అనగా సంతోషము, ఆనందము. ఆనాడు అది సామాన్యముగా పలుకరించడానికి అందరూ ఉపయోగించే పదము.

నియమము:

దేవుడు మన ఆధిక్యతనుబట్టి కాక తన కృపానుబట్టి మనకు మేలుచేస్తాడు.

అన్వయము:

ప్రభువైన క్రీస్తుకొరకు క్రైస్తవుని సేవ  బలవంతమువలనకాదు,  స్వేఛ్చాపూర్వకమైనది. ఎలాఅయితే యాకోబు తన సహూదరుడు ప్రభువైన యేసు యొక్క  ప్రక్యాతిని వాడుకోలేదో, అలానే క్రైస్తవులూ ప్రక్యాతి కొరకుకాక, యేసును సేవించుటకొరకు జాగ్రత్తపడాలి.   

భౌతికజన్మము వలన  యేసును వ్యక్తిగతముగా  తెల్సుకోడం వలన ఏ ప్రయోజనము లేదు. యాకోబు ప్రభువుకు తోబుట్టువైనను, పునరుర్ధానము వరకు రక్షకునిగా ఆయనను అంగీకరించలేదు. మెస్సయా రాజకుటంబానికి చెందినవాడైనప్పటికీ,  , పునరుర్ధానము వరకు అవిశ్వాసిగా ఉన్నాడు. భౌతిక కుటుంబ సభ్యునిగా ఉండుట వంటి ఆధిక్యతలు దేవుని అంగీకారమును పొందలేవు. మన తలాంతులు దేవుని అభిప్రాయములను మార్చలేవు. దేవుడు తలాంతులుగలవారిని మరియు తలాంతులులేనివారిని వాడుకుంటాడు.

దేవుడు ప్రజలను తన కృప వలన వాడుకుంటాడు. దేవుని కృప ఎల్లప్పుడు మానవ అర్హతలు ఆధీక్యతలకు మినహాయింపు

Share