నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
నా సహోదరులారా,
యాకోబు ప్రపంచమంతటా చెదరిన యూదా క్రైస్తవులను “సహూదారులు” గా భావించుచున్నడు.
ఈ సంబోధనను క్రైస్తవులకు ఈ పత్రికలో 15 మారులు ఉపయోగించాడు. తన ఆజ్ఞలను కరుణతో సమతుల్యం చేస్తున్నాడు.
యెంచుకొనుడి.
క్రైస్తవులు శ్రమలను ఆనందముతో కూడిన వైఖరితో ఎదుర్కోవాలి. శ్రమను తమ జీవితమునకు దేవుని సార్వభౌమ ప్రణాలికగా భావించాలి. మన సమస్యలను ఎదుర్కొనికుండా చేసే దిగులుపడే మాసాసిక స్తితికి దిగజారకూడదు.
“యెంచుకొనుడి” అనునది ఒక ఆజ్ఞ. శ్రమలను ఈ విధముగా ఎదుర్కోవడము సహజమైనది కాదు కనుక, క్రైస్తవులు తమ జీవితములో ఆనందమును లెక్కించుకొనేవారుగా ఉండాలి. దేవుని సార్వభౌమత్వమునుబట్టి ఉద్దేశపూర్వకంగానే శ్రమలలో ఆనందముతో కూడిన వైఖరిని కలిగిఉండాలి.
వారి జీవితంపట్ల దేవుని ప్రణాళికకు అనుగుణముగా మలచుకొనుటద్వారా క్రైస్తవులు తమ వైఖరిని నియంత్రణలో ఉంచుకోవాలి.
నియమము:
దేవుని సార్వభౌమ సంకల్పము మనకు మన శ్రమలను దృష్టికోణంలో ఉంచునట్లు చేస్తుంది.
అన్వయము:
క్రైస్తవులు ఉద్దేశపూర్వకముగా వారి వైఖిరిలో వారి శ్రమలను దేవుని ప్రణాళికలో భాగముగా చూడాలి. అది దేవుని చేటినుండి వస్తుంది అని మనము ఎరిగినవారము కనుక, దేవుడు సార్వభౌమముతో మన జీవితములో అనుమతించే ప్రతి అనభవమును ఆనందించదానికి అవకాశముగా ఎంచుకోవాలి. దేవుని ప్రణాళికలో అనవసరమైనది ఏది లేదు, ప్రతిదానికి ఒక ఉద్దశము ఉన్నది.
పరిపక్వతచెందిన క్రైస్తవులు శ్రమలలో ఆనందముతో కూడిన వైఖరి కలిగిఉంటారు. శరీరసంబంధులైన క్రైస్తవులు వారి పరిస్తితినిగురించి సణుగుతారు గొణుగుతారు. వారి జీవితము పట్ల దేవుని సార్వభౌమ ప్రణాళిక పట్ల అవగాహన లేని వారుగా ఉంటారు. పరిపక్వతచెందిన క్రైస్తవులు దేవుని సార్వభౌమతను వారికొరకైన దేవుని ఉద్దేశమును స్పష్టముగా గ్రహిస్తారు.