Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. 

 

నానా విధములైన

క్రైస్తవులు “నానా విధములైన” విభిన్నములైన శ్రమలలో పడుతుంటారు. ఒకే వైపుకాక అనేక వైపులా కష్టము ఎదుర్కుంటాము. వివిధారకములైన శ్రమలను ఎదుర్కుంటాము. వివిధ వర్ణములుగల అనే అర్ధము “నానా విధములైన” అనే పదము కలిగి ఉంది. శ్రమ వివిధ రూపాలలో వర్ణాలలో వస్తుంది. క్రైస్తవుని శ్రమలకు అనేక రంగులు ఉన్నాయి.

నియమము:

మన గుణశీలమును అభివృద్ధి చేయడానికి దేవుడు వివిధ రూపములు గల శ్రమలను అనుమతిస్తాడు.

అన్వయము:

క్రైస్తవుడు అన్ని రకములైన శ్రమలను ఎదుర్కోగలగాలి. శ్రమలు సంఖ్యాపరముగా కాక వాటి వైవిధ్యముమీద ఉద్ఘాటన ఉన్నది. ప్రతిఒక్కరికి శ్రమలు కలవు, అవి క్రమం తప్పకుండా, వివిధ రూపాలలో ఉంటాయి.  మన సన్నిహితులు మరణించుటవలన, ఆర్ధిక నష్టమువలన, అపార్ధమువలన, పాడైన సంబంధమువలన, ఇతరులనుండి నిందలు తీర్పులవలన నష్టాన్ని ఎదురుకుంటాము.

క్రైస్తవులు కూడా వారి సాక్షమునుబట్టి శ్రమను ఎదురుకుంటారు. దీనిని ఆచర్యం చెందకుండా ముందుగా అంచనా వెయవచ్చు .  దెవుడు మన విశ్వాసబలమును పరీక్షించాలనుకుంటుంన్నాడు.

కొన్నిమారులు మన సమస్యలు మనుశుల రూపములొ వస్తాయి. కొందరు నిర్మొహమాటముగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు మనము ఎదుర్కోవచ్చు. కొందరు గొప్ప ఉద్యోగ అవకాశాన్ని పొగొట్టుకోవచ్చు. ఈ విషయాలన్నీ మన విశ్వాసాన్నిపరీక్షిస్తాయి.

నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు. (యోబు 5:7).

స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును. (యోబు  14:1).

శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము. (కీర్తనలు  22:11).

 

Share