మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
శ్రమ నుండి సహనము ఎలా వస్తుందో, అలానే జ్ఞానము (అధిక కష్టములను తట్టుకొను సామర్ధ్యం) ప్రార్ధన నుండి వస్తుంది.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల
తన పాఠకులకు జ్ఞానము కోదువగా ఉన్నట్లు యాకోబు భావిస్తున్నాడు. క్రైస్తవుడు జ్ఞానమును కలిగి ఉండకపోతే దేవుడు దానిని అతనికి ఇస్తాడు. ఒకరి ఖాతాలో లోటును తెలిపే బ్యాంకింగ్ రంగానికి చెందిన పదజాలము “కోదువ”. పరీక్షకు మన సామర్ధ్యానికి అతీతమైన శ్రమలను తట్టుకోడానికి ప్రత్యేక జ్ఞానము అవసరము. శ్రమలు మన ప్రార్ధనా జీవితాన్ని మెరుగు చేయాలి.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:5-6).
నియమము:
జ్ఞానము గల వ్యక్తి ధృఢమైన నిర్ణయాలు తీస్కోగలడు.
అన్వయము:
జ్ఞానము గల విశ్వాసి, వాక్యసంబంధమైన ఇంగితజ్ఞానము కలిగిఉంటాడు. తన వాక్య పరిజ్ఞానము ఎలా ఉపయూగించాలో తెలిసిన వాడు. వాక్యాన్ని అనుభవముతో ఎలా అన్వయించాలో తెలుసు.
జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. (సామెతలు 4:7).
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. (సామెతలు 9:10).
తెలివిని సరిగావాడడమే జ్ఞానము. అది వివేకాన్ని, దేవుని వాక్యావిమర్శనను అభ్యసించదము. వాక్య పరిజ్ఞానము ఉండొచ్చు కానీ వాక్యాన్ని అనుసరించడము తెలియక పోవచ్చు.
వాక్యాన్ని మన అనుభవానికి అన్వయించడము తెలియకపోతే మనకు జ్ఞానములో కొదువ ఉన్నట్లు. ప్రత్యేకించి శ్రమలో ఇది నిజం. ఒక వ్యక్తి విధ్యాప్రవీణుడై జ్ఞానశూన్యుడై ఉండొచ్చు. విపర్యంగా, సరైన విధ్యాభ్యాసము లేకుండా జ్ఞానము కలిగిన వ్యక్తి కావొచ్చు. విధ్యాభ్యాస అవివేకాము కలిగి ఉండుటకు వీలు ఉండి. మరోవైపు దేవుని వాక్య పరిజ్ఞానము లేకుండా దేవుని జ్ఞానము వినియోగించలేము.