మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
అందరికిని ధారాళముగా దయచేయువాడు.
ఇక్కడ అందరికి అంటే దేవుడు ప్రతిఒక్కరికి వ్యక్తిగతంగా ఇస్తాడు. ప్రార్ధన ద్వారా ఆయన వద్దకు వచ్చినప్పుడు నిన్ను వ్యక్తిగా పరిగణిస్తాడు. ప్రార్ధన కేవలం మహాభాక్తులకేకాదు, ప్రతి ఒక్కరి ప్రార్ధన దేవుడు ఆలకిస్తాడు.
ధరాళముగా
దేవుడు ఇవ్వడం ఒక ఎత్తైతే, ధారళముగా ఇవ్వడము మరో ఎత్తు. ధారళముగా అనగా సరాళముగా, ఏ దాపరికములేకుండా, పూర్ణహృదయంతో, అని ఆర్దము. ఇందులో ఇష్టపూర్వకముగా, దాతృత్వముతో అనే భావన కలిగివుంది.
ఆయన ఎవనిని గద్దింపక
గద్దించుట అనగా దూషించుట, అవమానపర్చుట, అగౌరవర్చుట, కసురుకొనుట. ప్రార్ధనలో మనము దేవుని ఏదైనా అడిగినప్పుడు, దేవుడు మనలను అవమానించడు, చీవాట్లు పెట్టడు. ప్రార్ధనలో మన అధికారాన్ని అభ్యసించినప్పుడు, మనలను ధిఃక్కరించడు. దేవుడు మన యోగ్యతా విధానముననుసరించి మనకు ఇవ్వడు గాని, తన శుద్ధమైన, నిష్కల్మషమైన కృపానుబట్టి అనుగ్రహిస్తాడు.
నియమము:
దేవుని హృదయము నీపట్ల దాతృత్వ చూపుటకు నిర్దేశము కలిగివున్నది.
అన్వయము:
ఆయనను అడుగువారిపట్ల దేవుడు దాతృత్వము కలిగిఉన్నాడు. ఆయన బేషరతుగా ఇచ్చు దాత. మనము మనము అడుగు వాటిని బేరమాడకుండా ఇచ్చుటకు విశాల హృదయము కలిగి ఉన్నాడు.
ఆయన ఒకే ఒక నిబంధన కలిగివున్నాడు – మనము ఆయనను అడుగుట.
గొణుగుతూ దేవుడు తన ఈవూలను ఇవ్వడు. మన ప్రార్ధనలకు జావాబిచ్చుటకు సణుగడు. అలా చేయుటకు సంతోషిస్తాడు.
దేవుడు మన అవిశ్వాసముగూర్చి, హృదయాకాటిన్యమునుగూర్చి గద్దిస్తాడు.
పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. (మార్కు 16:14).