Select Page
Read Introduction to James యాకోబు

 

మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

 

అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును.

మనమెదుర్కునే శ్రమలను తట్టుకోడానికి దేవుడు మనకు జ్ఞానమునిస్తాడు. మానమడుగుడానికన్నా ఎకూవగా  జ్ఞానమివ్వడానికి దేవుడు అధిక వాంఛ కలిగిఉన్నాడు. ఏ మినహాయింపు, అసమ్మతి లేకుండా ప్రార్ధనకు దేవుడు జవాబిస్తాడు.

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు  (యిర్మియా 29:11-13).

ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను. (కీర్తనలు 81:10).

మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.  (యోహాను 14:13).

నియమము :

మన ప్రార్ధనలకు ఉత్తరమివ్వడానికి దేవుడు హామీ ఇస్తున్నాడు.

అన్వయము:

దేవుడు తప్పక మన ప్రార్ధనలను ఆలకిస్తాడు. “ అడుగుడి మీకివ్వబడును” (మత్తయి 7:7-11). జవాబు పొందిన ప్రార్ధన విశ్వాసముతో అడిగినదై ఉంటుంది. (8వ వచనము).

దేవుని వాగ్ధానము మీద కలిగిఉన్న యధ్హర్ధమైన నమ్మిక,  ప్రార్ధనకు దేవుడు స్పందించేలా చేస్తుంది. దేవుని దాతృత్వముపై మనము సందేహిస్తే, దేవుడు మన ప్రార్ధనలకు బదులివ్వడు.

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీ 11:6).

మనమెవ్వరము ప్రార్ధనకు జవ్వ్బు పొందుటకు యోగ్యులము కాము, కాని విషయం అది కాదు. విషయమేమంటే, ప్రార్ధనకు జవాబిచ్చుటకు దేవుడు కలిగిఉన్న ఉద్దేశము, ఆశ. ప్రార్ధనకు జవాబు పొందుటకు మనముగాని, మన ప్రార్ధన కానీ యోగ్యులము కాము. దేవుని యెదుట మనకు యే యోగ్యతా లేదు. అందువలననే మనము “యేసు నామమున” తండ్రి వద్దకు వెళ్తాము.

నిజమైన ప్రార్ధన దేవునిని నమ్మదగినవానిగా మరియు వాగ్దానము నిలబెట్టుకునే వానిగా చేరుకుంటుంది. ప్రార్ధనవిషయంలో దేవుడు నమ్మదగినవాడు. 

Share