Select Page
Read Introduction to James యాకోబు

 

అట్టి మనుష్యుడు …..ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

 

గనుక… తలంచుకొనరాదు.

తలంచుకొనుట అనగా ఆశించుట, ఊహించుట అని భావన. “గనుక” అను పదము ముందు నమ్మి ఆతరువాత అపనమ్మిక కలిగిన ద్విమనసుకలిగిన వ్యక్తిని సంధానము చేస్తుంది. (6వ వచనము)

అట్టి మనుష్యుడు అని నొక్కి చెప్పంబడింది. దేవుడు ఏ రకమైన వ్యక్తులకు జవాబిస్తాడో వారిగురించి బలమైన అంశముగా చూపిస్తున్నాడు. తమ స్వంత ప్రార్ధనలను సహితము నమ్మని అహంకారుల ప్రార్ధనలకు దేవుడు బదులివ్వడు. ఆయన ఎవరికైనా ముఖ్యముగా ప్రార్ధనకు జవాబిచ్చుటకు ఆయన సామర్ధ్యమును తీవ్రముగా సందేహించు వారికి జవాబిచ్చుటకు బద్దుడు కాదు.

ప్రభువువలన తనకేమైనను దొరుకునని

విశ్వాసులు దేవుని “విశ్వాసముతో” అడుగకపోతే (5వ వచనము), వారు దేవునినుండి ఏమియు పొందుకోరు. అపనమ్మిక గల  ద్విమనస్కుడు ప్రార్ధనకు జవాబు పొందడు. సందేహాలు జవాబు కలిగిన ప్రార్ధనలను ఖండిస్తాయి.  

మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకైదురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. (యాకోబు 4:3).

నియమము:

ద్విమనసుగల క్రైస్తవుడు ప్రభువు నుండి ప్రార్ధనకు జవాబు పొందలేడు.

అన్వయము:

ప్రార్ధనలగురించి మనలో కొందరికి  కొన్ని అపోహలు ఉంటాయి.  మనము ప్రార్ధన చేస్తున్నాము కాబట్టి దేవుడు జవాబిస్తాడు అనుకుంటాము. కాదు, దేవుడు విశ్వాససహితమైన ప్రార్ధనకు జవాబిస్తాడు. దేవుని మీద నమ్మికను అభ్యసించువాడు ఆ నమ్మికనుబట్టి ఘనపర్చబడుతాడు.

దేవుడు తన్ను అడుగువారికి ధారాలముగా దయచేస్తాడు అని సెలవిచ్చినప్పటికి,  కొందరు ఆయన మనకు భిక్షము ఇచ్చినట్లు ఇస్తాడు అని భావనతో ఆయన వద్దకు వస్తారు.  అట్టి ధైర్యము మనకు ఎక్కడ దొరుకుతుంది ?దేవునిని మనము ఏదైనా అడిగితే ఆయన వద్దనుండి ఏదైనా పొందడానికి ఆశకలిగి ఉండాలి.

నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును(కీర్తనలు 66:18). 

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె . ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను (లూకా 18:1).

Share