దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.
దీనుడైన సహోదరుడు
ఇక్కడ “దీనుడైన సహోదరుడు” తక్కువ స్థాయిలో ఉన్న, పేదరోకములో ఉన్న, దీనుడైన, గుర్తుంపు లేని స్తితిలో ఉన్న సాటి క్రైస్తవుడు.ఆ వ్యక్తి సమాజములో అడుగు స్తాయిలో, దీన పరిస్థితులలో ఉన్నవాడు.
ఈ వచనము ఒక ఆజ్ఞ – అతి స్వల్ప భౌతిక సొత్తులు కలిగిన క్రైస్తవులు నిత్యమైన వాటిలో ఆనందించాలి గాని అస్థిరమైన వాటిలో కాదు అని దేవుడు ఆదేశిస్తున్నాడు.
తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను
ఇక్కడ చాలా తక్కువగా కలిగిఉన్న క్రైస్తవులు ఆ తరువాత ఎక్కువగా పొందుకుంటారు. వారిని దేవుడు హెచ్చించే దినము ఒకటుంది. నిత్యత్వములో సాంఘిక స్తాయి ఉండదు. క్రైస్తవులు అతి స్వల్పముగా తాత్కాలిక సొత్తులు కలిగిఉన్నను, వారు ఎన్నటికీ కోల్పోని నిత్యమైన సంపదలను దేవుడు వారికి ఇస్తాడు. ప్రపంచములో ఉన్న అతి సంపన్నులైన వారికన్నా, ఇహసంబంధమైన సంపద అతి తక్కువగా కలిగిన క్రైస్తవులు సంపన్నులు. క్రైస్తవులు కాలముతో కాదు, నిత్యత్వపరంగా తమ సంపద గణిస్తారు ; దేవుడు చూచే ఆస్తి పరంగా కాని మ్యూచువల్ ఫండ్స్ మొత్తము మీద కాదు
నియమము:
క్రైస్తవులు తమ నిత్యత్వపు సంపద గురించి న్యాయపరముగా అతిశయించవచ్చు.
అన్వయము:
విలువలనుగూర్చి దేవుని ధృక్పథమును భావిస్తే, మన దృష్టిని విశాలపర్చుకుని మన ప్రస్తుత పరిస్తితిని మించి మనము ప్రోత్సాహము పొందవచ్చు. ఈ లోకములో అతి స్వల్ప ఆస్తులు కలిగిఉంటే, మన నిత్యత్వ సంపదను గూర్చి ఇంకనూ ఆనందించవచ్చు. మనము కలిగి ఉన్న లేక కలిగి లేని వాటిని బట్టి మనలను తరగతులుగా వారుచేయని వారు ఉండని రోజు ఒకటి రానున్నది.
నిత్యత్వపు దృక్కోణము పై పనిచేయుట ద్వారా, మనము భూసంపదలలో కాక పరలోక సంపాదలలో ఆనందిస్తున్నాము. ప్రస్తుతముకన్నా భవిష్యత్తులో క్రైస్తవుడు ఆనందిస్తాడు. సాంఘికముగా అంగీకిరించుటలో ప్రస్తుతకాలములో ప్రజలు మనలను క్రిందిస్తాయిలో ఉంచినను, దేవుడు తన అంగీకారములో ఉన్నత శాయిలో ఉంచుతానని హామీ ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ మనలను మన పరిస్తితులకు అతీతముగా నూతన ఉన్నత తలములో ఉంచుతుంది.
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. (రోమా 8:17).
క్రైస్తవునికి పేదరికము నిరాశకు ఎంతమాత్రము కారణముకాదు. క్రైస్తవము అర్ర్దిక ప్రపంచ ధృక్పదమూకాదు, కారణము అది అర్ర్దిక స్తితిగతులకు, బ్యాంకు అకౌంట్లకు, వ్యక్తిగత ఆస్తులకు మించినది. భూమి మీద యే స్థానము కన్నను దేవుని బిడ్డగా ఉండుటకు మించినది లేదు. మనమెదుర్కునే ఏ పరిస్తితిలోనైనా మనము దీనిని బట్టి ఆనందించగలము.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. (1పేతురు 2:9,10)