శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
శోధన సహించువాడు ధన్యుడు
శోధన సహించువాడు దేవుని దీవెన పొందుతాడు. సహించుట అను పదము మూలభాషలో ప్రతికూల పరిస్తితులలో ధృడత్వము కలిగిఉండుట అను భావన కలిగి ఉంది. ఈ పదము రెండు పదాల నుండి గ్రహింపబడినది: క్రింద, నిలచి ఉండు. భారము క్రింద నిలచిఉండుట అను భావన కలిగిఉంది. ఆశ వాదులుకోకు. అంటిపెట్టుకుని ఉండు. అక్కడే నిలచి ఉండు.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? (హెబ్రీ 12:1-3, 7)
ఈ వచనములో శోధన అనగా శ్రమ. శోధన లో పడిపోకుండా, నిలచి ఉండుట అను భావన కలిగిఉంది.
అతడు శోధనకు నిలిచినవాడై
సహించుట అనగా ప్రరీక్షలో ఉతీర్ణత పొందుట. ఈ వ్యక్తి విజయవంతముగా శ్రమను ఎదుర్కున్నాడు. సహించు వ్యక్తి దేవునిపట్ల నమ్మికను విదాచిపెట్టాడు; ఎంతటి విషయము ఎదురైనప్పటికి తన దేవుని ఎరిగినవాడు గనుక, దానిని ఓర్చుకుంటాడు. మన విశ్వాసము యొక్క నాణ్యతను రుజువు చేయుటయే శ్రమ యొక్క ఉద్దేశము.
నియమము:
శోధన మన విశ్వాసాని రుజువుచేస్తుంది.
అన్వయము:
దేవుడు మన విశ్వాసాన్ని ధృవీకరించే పనిలో ఉన్నాడు. మన విశ్వాస నాణ్యతను మూల్యాంకనము చేయుటకు దేవుడు సమయాన్ని వెచ్చిస్తే, మన భాద్యతగా మన కృషిని ఉంచుతున్నామా ?. మన ఇంట్లో వాడే వస్తువులు ధృవీకరింపబడినవిగా ఉండడానికి కోరుకుంటాము. అదే విధముగా దేవుడు తన గృహములో మన క్రైస్తవ జీవితములలో ధృవీకరింపబడిన ముద్రను కలిగిఉండాలని ఆశిస్తున్నాడు.
శోధన తీరిన తరువాత దేవుని వద్ద బహుమానము ఉన్నది గనుక క్రైస్తవులు శోధనలో ఆశీర్వాదపు చాయను కలిగిఉన్నారు.