ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు
“ప్రథమఫలము” అనే మాట పాతనిబంధనలో మొదటి భాగము మరియు శ్రేష్టమైన పంటను గురించి తెలుపునది (ద్వితీ 26:1–19). మొదటి పంట క్రొత్త కాలమును ప్రకటిస్తుంది. క్రొత్త క్రమమునకు అవి సూచన. యాజకుడు ప్రభువు ఎదుట ప్రధమ ఫలముల పనను అల్లాడిస్తాడు (లేవి 23:11). అది పంట దేవుని వద్ద నుండి వచ్చినది అని సూచిస్తుంది.
నూతన జన్మ ద్వారా క్రీస్తు నొద్దకు వచ్చు వారు దేవుడు తన రాజ్యమునకు దేవుడు నడిపించు జనములకు ముంగుర్తు, సూచనగా ఉన్నారు. దేవుని “ప్రధమ ఫలములుగా” దేవుని సేవించుటకు క్రొత్త సామర్ధ్యతతో శోధనలను మనము ఎదిరించవచ్చు.
నియమము:
క్రొత్త పంట రాబోవుచున్నది, క్రైస్తవులకు సమస్తము క్రొత్తదిగా ఉంటుంది.
అన్వయము:
క్రైస్తవుడు రక్షణ పొందిన సమయములోఆత్మ తిరిగి జన్మించుట మాత్రమే కాదు, పరలోక రాజ్య పారవేశమునందు సంపూర్తిగా ప్రాణాత్మదేహములు తిరిగి జన్మిస్తాయి.
మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. (రోమా 8:18-23).
తనకుటుంబమునకు చెందినవారు గనుక, దేవుడు క్రైస్తవులను, క్రైస్తవేతరులకంటే పైగా హెచ్చిస్తాడు. మనము “క్రీస్తు యొక్క వధువు”యై ఉన్నాము. (ప్రకటన 2:19).