నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను
యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో మూడవ గమనమునకు మనము వస్తున్నాము. మొదటి గమనము క్రైస్తవుడు శ్రమను ఎలా తట్టుకోవాలి, రెండవది శోధనను ఎలా తట్టుకోవలి, ఇప్పుడు మూడవది దేవుని వాక్యముతో ఎలా సంధానమవుతాడు అని.
యాకోబు 1:18-21 లో దేవుని వాక్యమును పలు పదాలతో సంబోధిస్తున్నాడు: “సత్య వాక్యము” “ నాటబడిన వాక్యము”, “వాక్యము”, “స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమము”. ఈభాగము దేవునివాక్యము గురించి నిండిఉన్నది.
గనుక
“గనుక” అను మాట దాని వెంట ఉన్న వాక్యము యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
నా ప్రియ సహోదరులారా
మూడు సూచనలతో యాకోబు తన పాతకులను ప్రేమతో సంభాషిస్తున్నాడు. తను ప్రేమించువారిని ఉపదేశించుటకు ఆయన భయపడుటలేదు. నిజమైన ప్రేమ ఇతరుల సంక్షేమమునకు కట్టుబడి ఉంటుంది. ఇది ప్రత్యేకించి దేవుని వాక్యము బోధించునపుడు సత్యము, ఎందుకనగా వారిగురించిన సత్యమును వారికి చెప్పాలి.
ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును
మనలో అనేకులు వినుటకు త్వరపడుటకన్నా మాట్లాడుటకు త్వరపడుతాము. ఇక్కడ వినుట దేవుని వాక్యము గురించి. మనము ఎక్కువగా మాట్లాడితే, దేవుని వాక్యము వినుటకు కష్టపడుతాము.
నియమము:
ఎదిగే క్రైస్తవుడు దేవుని వాక్యమునకు చెవిని తెరచి ఉంచు వైఖిరి కలిగి ఉండాలి.
అన్వయము:
దేవుని గూర్చి తెల్సుకోవలనుకొనువారికి వాక్యము పట్ల ఆకలి అనునది ఒక స్పష్టమైన గుర్తు. కష్టసమయములో ఈ వ్యక్తి దేవుని వాక్యము వైపు తిరుగుతాడు.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. (కీర్తనలు 1:2).
దేవుని వాక్యము నందు ఆనందించు వ్యక్తి, దేవుడు తనతో మాట్లాడాలని ఆకలి కలిగిఉండును. సంఘములో ఇతర క్రైస్తవులు ప్రతీక్షిస్తారు అని కాక దేవుని మీద ప్రేమను బట్టి దేవుని వాకము చదువుతాడు.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును
యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును
యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును (కీర్తనలు 19:7-9).
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను (కీర్తనలు 119:11).
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; (యోహాను 8:31).
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2 తిమో 3:16-17).
థెస్సలోనికయలోనివారి వాక్యముపట్ల వైఖిరి – దేవుడు వ్యక్తిగతముగా వారితో మాట్లాడుతున్నట్లు వారు దేవుని వాక్యము విన్నారు.
ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. (1థెస్స 2:13).
దేవుడు తన హృదయమును పరీక్షించి చూడాలని దావీదు కోరుచున్నడు:
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్యమార్గమున నన్ను నడిపింపుము. (కీర్తనలు 139:23-24).