Select Page
Read Introduction to James యాకోబు

 

నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

 

మాటలాడుటకు నిదానించువాడును

 “నిదానించు” అనుమాట ఈ వచనములో రెండు మారులు ఉపయోగింపబడినది. తన నోటిని ఉపయోగించేముందు, లేక కోపముతో పలికే ముందు క్రైస్తవుడు కొంత సమయము ఆగాలి.

నియమము:

తొందరపాటుగా   మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడం కష్టము.

అన్వయము:

 “వినుటకు వేగిరపడుట”కు బదులు మాట “మాట్లాడుటకు నిదానించుట”. మనము ఎల్లప్పుడు మాట్లాడేవారమైతే మనము దేవుని మాట వినలేము. దేవుడు ఏమిచెప్తున్నాడో వినుదానికాన్న మనమేమీ చేపాలనుకుంటున్నామో అనుదానిగూర్చి ఎక్కువగా జాగ్రతపడితే, మనకు ఆత్మీయ సమస్య ఉన్నట్లు.

విస్తారమైన మాటలలో దోషముండక మానదు
తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. ( సామెతలు 10:19).

మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.ఒకడు మూఢుడైనను మౌనముగానుండినయెడల జ్ఞానిఅని యెంచబడును.అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అనియెంచబడును. (సామెతలు 17:27-28).

ఆతురపడి మాటలాడువాని చూచితివా?వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును. (సామెతలు 29:20).

మనమే అంతా మాట్లాడి ఎవరితోనైనా ఉన్న విభేదాన్ని తొలగించాలనుకుంటే మనము ఆ సమస్యను పరిష్కరించలేము. మనము ఏమంటున్నమంటే,  “నువ్వేమనుకుంటున్నావో అది నాకు అనవసరము. సమస్యగురించి నేనేమనుకుంటున్నానో అదే నాకు అవసరము. మన స్వంత ఆలోచనలమీద మన శ్రద్ద నిలిపితే దేవుని వాక్యానికి ప్రతిస్పందించడం కష్టమవుతుంది.

మనము మాట్లాడుటకు ముందు ఆగినట్లైతే, మనము మాట్లాడవలసిన సమయము వచ్చినపుడు మాట్లాడటానికి సరియైన మూలము ఉంటుంది. మనము దేవుని ధృక్పధమునుండి మాట్లాడుతాము.

మన తరములో మాట్లాడుటకు త్వరపడు వారితో నిండి ఉన్నది. మన చిన్నపాటి సమూహాల్లో ప్రజలను ప్రతిదానిమీద మాట్లాడాలని ప్రోత్సాహిస్తాము. ఇది అవివేకానికి కారణము. ఎవరు ఏ పరిశోధన చేయలేదు. బైబిల్ని ఎవరు జాగ్రత్తగా చదువలేదు. బొహకునిగా లేక కాపరిగా ఎవరికి వరము లేదు. ఫలితము: అవివేకాపు గుంపు.

ఆలోచించకుండా మాట్లాడు మాటలు, ఇష్టము వచ్చినట్లు పలికే మాటలు చాలా ప్రాధకారము (యాకోబు 3)

Share